
షార్జా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఇక తొడ కండరాల గాయంతో బాధపడుతున్న విజయ్ శంకర్ ఈ మ్యాచ్ దూరమయ్యాడని అతని స్థానంలో అభిషేక్ శర్మ జట్టులోకి వచ్చాడన్నాడు. సాహా మాత్రం ఫిట్‌గానే ఉన్నాడని తెలిపాడు.
ఇక తాము టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకునేవాళ్లమని బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. నవ్‌దీప్ సైనీ జట్టులోకి వచ్చాడని దాంతో శివమ్ దూబే, డేల్ స్టెయిన్ ఉద్వాసనకు గురయ్యారన్నాడు. ఇసురు ఉడానా అవకాశం దక్కించుకున్నాడని తెలిపాడు.
ప్లే ఆఫ్ రేస్ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకం. లీగ్‌లో ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్10 పాయింట్లు సాధించింది. దీంతో మిగిలిన (బెంగళూరు, ముంబై) రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. పాయింట్లకు తోడు మెరుగైన నెట్‌రన్ రేట్‌తోనే సన్‌రైజర్స్ ముందడుగు వేయగలదు. దీంతో ఆరెంజ్ ఆర్మీకి భారీ విక్టరీలు కావాలి. అలా కాకుండా ఏ ఒక్కదానిలో ఓడినా సన్‌రైజర్స్ ఐపీఎల్13 జర్నీ లీగ్ స్టేజ్‌లోనే ముగుస్తుంది.
మరోపక్క బెంగళూరుది కాస్త మెరుగైన పరిస్థితి. 12 మ్యాచ్‌లాడి 14 పాయింట్లు సాధించిన బెంగళూరు.. తమకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. రెండింటిలోనూ ఓడితే మిగిలిన టీమ్స్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాగా.. సీజన్ స్టార్టింగ్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. ఓటమి ముంగిట హైదరాబాద్ చేతులెత్తేసింది. మరీ ఈ మ్యాచ్‌లో గెలిచి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్లే ఆఫ్ రేసులో నిలవాలని డేవిడ్ సేన భావిస్తోంది.
తుది జట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: జోష్ ఫిలిప్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), గుర్‌కీరత్ సింగ్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, నవదీప్ సైనీ, ఇసురు ఉడానా, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), వృద్దిమాన్ సాహా(కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమాద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, షెబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టీ నటరాజన్