RCB vs SRH: బ్యాటింగ్‌లో కోహ్లీసేన అట్టర్ ఫ్లాఫ్.. హైదరాబాద్ ముందు ఈజీ టార్గెట్!

షార్జా: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విధ్వంసకర వీరులంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో ఆర్‌సీబీ.. హైదరాబాద్ ముందు 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. టాపార్డర్, మిడిలార్డర్ కట్టకట్టుకొని విఫలమవడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు చేసింది. జోష్ ఫిలిప్(32), ఏబీ డివిలియర్స్(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ(2/20), జాసన్ హోల్డర్(2/27) రెండేసి వికెట్లు తీయగా.. రషీద్, నటరాజన్, నదీమ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

కోహ్లీ X సందీప్ @7
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి మంచి ఆరంభం దక్కలేదు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన ఓపెనర్ దేవదత్ పడిక్కల్(5) ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(7) కూడా దారుణంగా విఫలమయ్యాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లోనే విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఐపీఎల్‌లో కోహ్లీని ఔట్ చేయడం సందీప్ శర్మకు ఇది ఏడో సారి. దాంతో ఆర్‌సీబీ పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లకు 30 పరుగులు మాత్రమే చేసింది.

ప్చ్.. ఏబీడీ కూడా..
అనంతరం డివిలియర్స్(24), ఫిలిప్(32) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. నిదానంగా ఆడిన ఏబీడీ ఒక సిక్స్, ఫోర్‌తో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించింది. కానీ నదీమ్ బౌలింగ్‌లో డీప్ పాయింట్ దిశగా భారీ షాట్ ఆడిన ఏబీడీ.. అభిషేక్ శర్మ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 43 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్‌లోనే ఓపెనర్ ఫిలిప్‌ను రషీద్ ఖాన్ ఔట్ చేయడంతో 76 పరుగులకే ఆర్‌సీబీ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.

చివర్లో టపటపా..
ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్(21), గుర్‌క్రీత్‌తో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఐదో వికెట్‌కు 30 పరుగుల జోడించిన అనంతరం వాషింగ్టన్.. నటరాజన్‌కు రిట్నర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన క్రిస్ మోరిస్(3), ఉడానా(0) ఒకే ఓవర్లలో ఔటవ్వడంతో ఆర్‌సీబీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications