RCB vs SRH: హైదరాబాద్ గెలిచిందోచ్.. టైటిల్ రేసులో నిలిచిందోచ్!

షార్జా: ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్నందుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో గెలుపొందింది. ఫలితంగా నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకోవడంతో పాటు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన కోహ్లీసేన.. ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు చేసింది. జోష్ ఫిలిప్(32), ఏబీ డివిలియర్స్(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ(2/20), జాసన్ హోల్డర్(2/27) రెండేసి వికెట్లు తీయగా.. రషీద్, నటరాజన్, నదీమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 14.1 ఓవర్లలో 5 వికెట్లకు 121 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వృద్దిమాన్ సాహా(32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 39), మనీష్ పాండే (19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26), జాసన్ హోల్డర్ (10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 26 నాటౌట్) రాణించారు. బెంగళూరు బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీయగా.. సైనీ, ఉడానా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.

శుభారంభంలేదు.. కానీ
121 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్(8) ఆ జోరును కొనసాగించలేకపోయాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి దూకుడు కనబర్చిన డేవిడ్ బాయ్.. ఆ మరుసటి బంతికే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో హైదరాబాద్ 11 పరుగులకే వికెట్ కోల్పోయింది. అయితే క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే సైనీ బౌలింగ్‌లో 6, 4 కొట్టగా.. సిరాజ్ వేసిన ఆరో ఓవర్‌లో సాహా కూడా 6, 4 కొట్టడంతో హైదరాబాద్ పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 58 రన్స్ చేసింది.

చాహల్ మ్యాజిక్..
అయితే చాహల్ వేసిన మరుసటి ఓవర్‌లోనే మనీష్ పాండే అనవసర షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. దాంతో హైదరాబాద్ పరుగుల వేగం తగ్గింది. ఇక చాహల్ మరుసటి ఓవర్‌లో సాహా స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడగా బంతి నేరుగా నాన్ స్ట్రైకింగ్ వికెట్లను తాకింది. అయితే బంతి తన చేతులకు తాకిందని చాహల్ అప్పీల్ చేయడంతో అంపైర్ రివ్యూకు వెళ్లాడు. టీవీ రిప్లేలో పలుమార్లు పరిశీలించిన అంపైర్ శంషుద్దీన్.. బంతి చాహల్ చేతికి తాకినట్లు క్లారిటీ లేకపోవడంతో బెన్‌ఫిట్ ఆఫ్ బ్యాట్స్‌మెన్ కింద నాటౌట్ ఇచ్చాడు.

బ్యాక్ టు బ్యాక్ వికెట్స్‌తో..
ఈ నిర్ణయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా చాహల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అంపైర్ విలియమ్సన్ బ్యాట్ పెట్టాడా? లేదా? అనే విషయాన్ని పరిశీలించలేదు. కానీ తర్వాత టీవీ రిప్లేలో విలియమ్సన్ బ్యాట్ పెట్టినట్లు స్పష్టమైంది. దాంతో ఈ అప్పీల్‌కు అర్థమే లేకుండా పోయింది. ఇక చాహల్ తన మరుసటి ఓవర్‌లో మ్యాజిక్ బాల్‌తో సాహాను బోల్తా కొట్టించాడు. టెంప్టింగ్ బాల్‌తో స్టంపౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ వెంటనే ఉడానా బౌలింగ్‌లో విలియమ్సన్(8) కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో కొంత ఉత్కంఠ రెకెత్తింది.

జాసన్ జాలీగా..
కానీ క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్ రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టగా.. అభిషేక్ శర్మ మరో సిక్సర్ కొట్టడంతో హైదరాబాద్ విజయ సమీకరణం 38 బంతుల్లో 7గా మారింది. ఇక భారీ షాట్‌కు ప్రయత్నించిన అభిషేక్ శర్మ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కానీ జాసన్ విన్నింగ్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడంతో హైదరాబాద్ విజయం లాంఛనమైంది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలోకి దూసుకెళ్లింది. తదుపరి మ్యాచ్ గెలిచేస్తే ఆరెంజ్ ఆర్మీ సులువుగా ప్లే ఆఫ్స్ చేరుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications