న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs RR: వాట్ ఏ షాట్ మామ.. యువరాజ్ సిక్స్ హిట్టింగ్ ఛాలెంజ్‌కు బదులిచ్చిన పడిక్కల్!!

IPL 2020, RCB vs RR: Not competing with you: Devdutt Padikkal’s response to Yuvraj Singh

షార్జా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 2020లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బెంగళూరు ఓపెనర్ దేవదత్‌ పడిక్కల్‌ మరోసారి మెరిశాడు. రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్‌ హాఫ్‌ సెంచరీ సాధించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 33 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్న పడిక్కల్‌.. మరో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇది పడిక్కల్‌కు మూడో ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీ.

మూడు హాఫ్‌ సెంచరీలు:

ఈ సీజన్‌లో ఇప్పటివరకూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. దేవదత్‌ పడిక్కల్‌ మూడు హాఫ్‌ సెంచరీలు చేశాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్‌ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా పడిక్కల్‌ అరుదైన రికార్డు సాధించాడు. ముంబై ఇండియన్స్‌పై 54 పరుగులు సాధించిన పడిక్కల్‌.. కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో 1 పరుగు చేసి విఫలమయ్యాడు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 56 పరుగులు సాధించాడు. తాజాగా రాజస్తాన్‌పై మరో హాఫ్‌ సెంచరీ (45 బంతుల్లో 63; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) చేశాడు.

ఎక్కువ దూరం సిక్స్ కొడతారో చూద్దాం

ఎక్కువ దూరం సిక్స్ కొడతారో చూద్దాం

174 పరుగుల‌తో బెంగళూరు తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న దేవదత్‌ పడిక్కల్ ఆటతీరుపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేశాడు. అందులో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీని ప్రశంసిచిన యువీ.. పనిలోపనిగా పడిక్కల్‌ను కూడా పొగిడేశాడు. 'ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం. గత 8 ఏళ్లలో విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోవడం నేనెప్పుడూ చూడలేదు. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం' అని యువీ పేర్కొన్నాడు. 'పడిక్కల్‌ బాగా ఆడుతున్నాడు. ఇద్దరం కలిసి బ్యాటింగ్ చేయాలనుంది. ఎవరు ఎక్కువ దూరం సిక్స్ కొడతారో చూద్దాం' అని సరదాగా ఛాలెంజ్ చేశాడు.

మీతో పోటీ పడటం లేదు బయ్యా

మీతో పోటీ పడటం లేదు బయ్యా

యువరాజ్ సింగ్ ట్వీట్‌కు దేవదత్‌ పడిక్కల్ బదులిచ్చాడు. 'మీతో పోటీ పడటం లేదు బయ్యా. మిమ్మల్ని చూసే ఫ్లిక్ షాట్ ఆడటం నేర్చుకున్నా. మీతో బ్యాటింగ్ చేయాలని ఎప్పుడూ అనుకునేవాడిని. ఆ అవకాశం కోసం చూస్తున్నా' అని పడిక్కల్ ట్వీట్ చేశాడు. అయితే తాజాగా పడిక్కల్ ఫ్లిక్ షాట్ ఆడాడు. ఆ షాట్ అచ్చం యువీ ఆడినట్టే ఉంది. ఆ ఫ్లిక్ షాట్ వీడియోను ఫ్యాన్స్ ట్వీట్ చేసి అచ్చం యువీలాగే ఆడాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రధాన ఆటగాడిగా

ప్రధాన ఆటగాడిగా

ఐపీఎల్‌ 2020లో పార్థీవ్‌ పటేల్‌ స్థానంలో ఓపెనర్‌గా దిగిన దేవదత్‌ పడిక్కల్‌.. అంచనాలను అందుకుంటూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఏకంగా మూడు హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. పడిక్కల్‌ తన అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆర్సీబీకి విజయాలు అందిస్తూ ఇప్పుడు ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు. దాంతో పడిక్కల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

SRH vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. స‌న్‌రైజ‌ర్స్‌కు భారీ షాక్!!

Story first published: Sunday, October 4, 2020, 15:57 [IST]
Other articles published on Oct 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X