RCB vs KXIP: జోష్‌లో బెంగళూరు.. పంజాబ్‌కు చావోరేవో.. గేల్ గెలిపిస్తాడా!!

దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం రాత్రి 7:30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. ఐపీఎల్ 2020లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు ఎన్నడూ లేని విధంగా అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
మరోవైపు కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ వరుస పరాజయాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే.. ఇక నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిందే. మ్యాచ్ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలేంటో ఓసారి చూద్దాం.

జోష్‌లో బెంగళూరు
బెంగళూరు ఈసారి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. లోతైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆ జట్టును ఇన్నాళ్లు బౌలింగ్ సమస్య వేధిస్తోంది. అయితే ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇసురు ఉదాన, క్రిస్ మోరిస్, యుజ్వేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్ బాగా రాణిస్తున్నారు. ఇక బ్యాటింగ్‌లో యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ జట్టుకు వెన్నముఖ. ఈ మ్యాచ్‌కు పాత జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆడిన మ్యాచ్‌లో బెంగళూరును పంజాబ్ భారీ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు భావిస్తోంది.

ఓపెనర్‌గా గేల్
పంజాబ్‌కు ఇక నుంచి చావోరేవో పరిస్థితి. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇక నుంచి ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ రాహుల్ సేన విజయం సాధించి తీరాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తడబడుతున్న ఆ జట్టు జోష్‌లో ఉన్న బెంగళూరును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఐపీఎల్ 2020లో ఇప్పటి వరకూ బరిలో దిగని క్రిస్ గేల్.. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్‌గా ఆడటం ఖాయం. గత రెండు మ్యాచ్‌ల్లో గేల్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావించినా.. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆడలేకపోయాడు. గేల్ జట్టులోకి వస్తే.. మయాంక్ అగర్వాల్ మూడో స్థానంలో ఆడాల్సి ఉంటుంది.

మిడిల్ ఆర్డర్ సమస్య
ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్ మినహా ఎవరూ రాణించడం లేదు. పంజాబ్‌ను మిడిల్ ఆర్డర్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పూరన్ హిట్టింగ్ మాత్రమే చేస్తున్నాడు. మ్యాక్స్‌వెల్, మన్‌దీప్ సింగ్ విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో గేల్ తన ట్రేడ్ మార్కు షాట్లతో విరుచుకుపడి భారీ స్కోరు సాధిస్తే పంజాబ్‌పై ఒత్తిడి తగ్గుతుంది. రాహుల్ సేనకు గెలుపు అవకాశాలు సైతం మెరుగుపడతాయి. మరి పంజాబ్ గేల్ మంత్రం పనిచేస్తుందో లేదో వేచి చూడాల్సిందే. బౌలింగ్ విషయంలో పంజాబ్ ఇబ్బంది పడుతోంది. షమీ, బిష్ణోయ్ రాణిస్తున్నా.. స్లాగ్ ఓవర్లలో సరిగా బౌలింగ్ చేయలేకపోతున్నారు.

పంజాబ్ భారీ విజయం
ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 25 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో పంజాబ్ 13 మ్యాచుల్లో విజయం సాధించింది. బెంగళూరు 12 విజయాలు నమోదు చేసింది. ఈ మ్యాచులో గెలిచి లెక్కసరిచేయాలని కోహ్లీసేన చూస్తోంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 97 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

జట్లు (అంచనా):
పంజాబ్: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మన్‌దీప్ సింగ్, క్రిస్ జోర్డాన్, మహమ్మద్ షమీ, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్.
బెంగళూరు: దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, శివం దూబె, క్రిస్ మోరిస్, ఇసురు ఉదాన, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.
ఇక ఆడింది చాలు.. ఐపీఎల్ నుంచి కోహ్లీ, డివిలియర్స్‌ను బ్యాన్ చేయాలి: కేఎల్ రాహుల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications