Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లీని ఊరిస్తున్న రికార్డు.. 7 ఫోర్లు, 3 సిక్సులు కొడితే..

IPL 2020, RCB vs KKR: Virat Kohli and De Villiers chase milestones

షార్జా: కోల్‌‌‌‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో కోహ్లీ 7 ఫోర్లు, 3 సిక్సులు బాదితే టోర్నీ మొత్తంలో 500 బౌండరీలు, 200 సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో విరాట్‌కు ఇదేం పెద్ద కష్టం కాకపోవచ్చు. అతని సూపర్ బ్యాటింగ్‌తోనే ఆర్‌సీబీ విజయాలనందుకుంటుంది.

ఇప్పటికే 6 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు 4 విజయాలు, 2 ఓటములతో 8 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ప్రారంభ సీజన్‌ నుంచీ ఆడుతున్న కోహ్లీ ఈ లీగ్‌ చరిత్రలో ఒకే జట్టు తరఫున ఆడుతున్న ఏకైక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఆర్‌సీబీ తరఫున మొత్తం 183 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌ 5,635 పరుగులు చేశాడు. దీంతో టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం 131 స్ట్రైక్‌రేట్‌తో కొనసాగుతున్న అతడు 5 శతకాలు, 38 అర్ధ శతకాలతో 493 ఫోర్లు, 197 సిక్సర్లు బాదాడు. మరోవైపు ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ మరో మూడు క్యాచ్‌లు అందుకుంటే ఈ టోర్నీలో 100 క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా నిలుస్తాడు.

కోల్‌కతా జట్టులో ఇయాన్ మోర్గాన్ మరో ఐదు సిక్స్ లు బాదితే 50 సిక్స్‌లు పూర్తి చేసుకుంటాడు. గత మ్యాచ్‌లో గాయపడ్డ విధ్వంసకర వీరుడు ఆండ్రూ రస్సెల్ నేటి మ్యాచ్ ఆడేది డౌట్‌గా ఉన్నా.. మరో 45 రన్స్ చేస్తే ఐపీఎల్ 1500 పరుగులు పూర్తి చేసుకుంటాడు.

ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు జరగ్గా 14-10తో కోల్‌కతానే పై చేయి సాధించింది. చివరగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు కోల్‌కతానే గెలిచింది. ఇక గత సీజన్‌‌లో మాత్ర చెరొక విజయాన్నందుకున్నాయి. 2014లో యూఏఈల జరిగిన ఏకైక మ్యాచ్‌లో కూడా కేకేఆరే గెలుపొందింది.

Story first published: Monday, October 12, 2020, 18:25 [IST]
Other articles published on Oct 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+