
దుబాయ్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చిన్నమైదానం, పిచ్ బ్యాటింగ్ అనుకూలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. జట్టులో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామన్నాడు. గుర్‌క్రీత్ సింగ్ స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.
ఇక టాస్ ఓడిపోవడంపై ఎలాంటి ఇబ్బంది లేదని కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ అన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో ఓ మార్పు చోటు చేసుకుందని, వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సునీల్ నరైన్ స్థానంలో ఇంగ్లండ్ సెన్సేషన్ టామ్ బాంటన్‌ను తీసుకున్నామన్నాడు.
ఇక మ్యాచ్‌కు ముందు టామ్ బాంటన్ ఇయాన్ మోర్గాన్ చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచిన ఉత్సాహంతో ఆర్‌సీబీ బరిలోకి దిగుతుండగా.. కింగ్స్ పంజాబ్‌తో స్పూర్తిదాయకమైన విజయాన్నందుకున్న కేకేఆర్ అదే జోరు కొనసాగించాలనుకుంటుంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన ఇరు జట్లు పాయింట్స్ టేబుల్లో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు జరగ్గా 14-10తో కోల్‌కతానే పై చేయి సాధించింది. చివరగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు కోల్‌కతానే గెలిచింది. ఇక గత సీజన్‌లో మాత్రం చెరొక విజయాన్నందుకున్నాయి. 2014లో యూఏఈ వేదికగా జరిగిన ఏకైక మ్యాచ్‌లో కూడా కేకేఆరే గెలుపొందింది.
తుది జట్లు:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (కీపర్), మహ్మద్ సిరాజ్, శివం దూబే, ఇసురు ఉడానా, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోర్రిస్, నవ్‌దీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్
కోల్‌కతా నైట్‌రైడర్స్: శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్ (కెప్టెన్, కీపర్), ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, టామ్ బాంటన్, రాహుల్ త్రిపాఠి, పాట్ కమిన్స్, కమలేష్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ