Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs KKR: ఆర్‌‌సీబీ ఆల్‌రౌండ్‌ షో.. కోల్‌కతా ఫ్లాఫ్ షో!

De Villiers, Chahal and Sundar

షార్జా: ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌‌సీబీ) జోరు కొనసాగుతుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో చెలరేగిన కోహ్లీసేన 82 పరుగులతో ఘన విజయాన్నందుకుంది. దాంతో లీగ్‌లో ఐదో గెలుపును ఖాతాలో వేసుకొని పాయింట్స్ టేబుల్లో మూడు స్థానంలో నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్(33 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్స్‌లతో 73 నాటౌట్)అజేయ హాఫ్ సెంచరీకి తోడు ఆరోన్ ఫించ్(37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 47), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో 1 ఫోర్‌తో 33 నాటౌట్), దేవదూత్‌ పడిక్కల్‌(23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ 32‌) రాణించారు.కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, ఆండ్రూ రస్సెల్ చెరొక వికెట్ తీశారు.

అనంతరం కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. శుబ్ మన్ గిల్(34) మినహా అంతా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోర్రిస్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. సైనీ, సిరాజ్, చాహల్, ఉడానా తలో వికెట్ పడగొట్టారు.

195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆర్‌‌సీబీ బౌలింగ్ ముందు తేలిపోయింది. శుబ్‌మన్‌ గిల్ మినహా ఎవరూ కనీస పోరాటపటిమ కనబర్చలేకపోయారు. కేకేఆర్‌ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారంటే వారి బ్యాటింగ్ ఎంత అద్వాన్నంగా ఉందో అర్దం అవుతోంది. దాంతో కోల్‌‌‌కతా ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Story first published: Monday, October 12, 2020, 23:39 [IST]
Other articles published on Oct 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+