RCB vs KKR: గత మ్యాచ్‌లో డక్కౌటయ్యా.. నిద్రలేని రాత్రులు గడిపా.. ఈరోజు మాత్రం: డివిలియర్స్

దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో డక్కౌటవ్వడంతో దారుణంగా అనిపించిందని, నిద్రలేని రాత్రులు గడిపానని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బ్యాట్స్‌మన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ తెలిపాడు. ఈరోజు అర్ధశతకం చేసినందుకు సంతోషంగా ఉందని, ఇక హాయిగా నిద్రపోవచ్చు అని ఏబీ అన్నాడు. సోమవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. డివిలియర్స్ 23 బంతుల్లోనే అర్ధ శతకం బాది 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.

నిద్రలేని రాత్రులే:
మ్యాచ్ అనంతరం ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ... 'ఈ మ్యాచ్‌లో బాగా ఆడడం సంతోషంగా ఉంది. చెన్నైతో ఆడిన గత మ్యాచ్‌లో డక్కౌటయ్యా. అలా అయితే బ్యాట్స్‌మెన్‌కు నిద్రలేని రాత్రులే మిగులుతాయి. నేను కూడా అనుభవించా. ఈ రోజు నేను బాగా ఆడడంతో సంతోషంగా ఉన్నా. బ్యాటింగ్ చేయడానికి షార్జా పిచ్ అనుకూలంగా లేదని తెలుసు. కానీ 150 స్కోర్ చేస్తే సరిపోదనిపించింది. అందుకే ధాటిగా ఆడాలని నిర్ణయించుకున్నా. మా జట్టు 194 పరుగులు చేయడంతో అద్భుతంగా అనిపించింది' అని అన్నాడు.

కీపర్‌గా కొనసాగడం సంతోషం:
మళ్లీ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టడంపై కూడా ఏబీ స్పందించాడు. కీపర్‌గా కొనసాగితే మ్యాచ్ పరిస్థితులపై మంచి అవగాహన ఉంటుందని, తనకు ఆ బాధ్యతలు తీసుకోవడం ఉత్సాహంగా అనిపించిందన్నాడు. దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా మారినప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. ఇప్పుడు బెంగళూరు జట్టులో మళ్లీ కీపర్‌గా కొనసాగడం సంతోషంగా ఉందన్నాడు. వికెట్ల వెనుక నిలబడితే సమాచారం అంతా అందుతుందని, దాంతో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు బౌలర్లకు విలువైన సూచనలు చేస్తానని ఏబీ చెప్పాడు.

ఆ రోజుల్లో అలసటగా అనిపించేది:
ఫీల్డింగ్, కీపింగ్ అనేవి రెండు వేర్వేరు అంశాలని.. తాను ఫీల్డర్‌గా చేసే రోజుల్లో అలసటగా అనిపించేదని ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. ప్రస్తుత సీజన్‌లో క్యాచ్‌లు పట్టడం లేదా స్టంపింగులు చేయడానికి తనకు పెద్దగా అవకాశాలు రాలేదన్నాడు. ఉన్నంత వరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే కృషి చేస్తానని ఏబీ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచులో ఏబీ 33 బంతుల్లో 73 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

10 సార్లు శతక భాగస్వామ్యాలు:
బెంగళూరు ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ (73), విరాట్ కోహ్లీ (33) అద్భుతంగా బ్యాటింగ్ చేసి 46 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. దీంతో ఈ టోర్నీలో 10 సార్లు శతక భాగస్వామ్యాలు నిర్మించిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కారు. అలాగే వీరిద్దరూ కలిసి 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. కోహ్లీ-డివిలియర్స్ తర్వాత విరాట్ కోహ్లీ-క్రిస్ గేల్ 9 సార్లు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, శిఖర్ ధావన్- డేవిడ్ వార్నర్ ఆరు సార్లు, వార్నర్-బెయిర్‌స్టో 5 సార్లు ఈ ఘనత నమోదుచేశారు.
కోల్‌కతా అసలు భయం అదేనా?.. అందుకే సునీల్ నరైన్‌ను ఆడించలేదా?!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications