For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KKR: దంచికొట్టిన డివిలియర్స్.. కోల్‌కతాకు భారీ లక్ష్యం!

IPL 2020, RCB vs KKR: AB de Villierss late blitz helps Bangalore post 194

షార్జా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఏబీ డివిలియర్స్(33 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్స్‌లతో 73 నాటౌట్)అజేయ హాఫ్ సెంచరీకి తోడు ఆరోన్ ఫించ్(37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 47), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో 1 ఫోర్‌తో 33 నాటౌట్) రాణించడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, ఆండ్రూ రస్సెల్ చెరొక వికెట్ తీశారు.

ఇక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్‌సీబీకి ఓపెనర్లు ఫించ్, దేవదూత్‌ పడిక్కల్‌(23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ 32‌) మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్ రస్సెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఫించ్‌కు కోహ్లీ జత కలిశాడు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ స్టైక్‌ రొటేట్‌ చేశారు. కానీ ఫోర్లు, సిక్స్‌లు రాకపోవడంతో ఆర్‌సీబీ స్కోరులో వేగం తగ్గింది. దాంతో ఒత్తిడికి లోనైన ఫించ్ ప్రసిద్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

ఈ పరిస్థితుల్లోక్రీజ్‌లోకి వచ్చిన ఏబీడీ విశ్వరూపం ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తిచేస్తున్నాడు. ఆర్‌సీబీ రన్‌రేట్‌ను అమాంతం పెంచేసాడు. మరోవైపు ఏబీడీకి ఎక్కువ స్ట్రైక్ ఇచ్చిన కోహ్లీ 25వ బంతికి తొలి బౌండరీ సాధించాడు.

Story first published: Monday, October 12, 2020, 21:41 [IST]
Other articles published on Oct 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+