For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KKR: ఏబీ డివీలియర్స్‌ 73 నాటౌట్.. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ రికార్డు బ్రేక్!!

IPL 2020, RCB vs KKR: AB de Villiers breaks Chris Gayles record for most man of the match awards
IPL 2020 : Ab Devilliers Breaks Chris Gayle Record | Royal Challengers Bangalore | Oneindia Telugu

దుబాయ్: షార్జా వేదికగా సోమవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్ ‌(కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) 82 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ రెండు వికెట్లకు 194 పరుగులు చేసింది. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (73*; 33 బంతుల్లో, 5×4, 6×6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్‌ 9 వికెట్లు కోల్పోయి 112 పరుగులకే పరిమితమైంది. దీంతో కోహ్లీసేన ఐపీఎల్ 2020లో ఐదో విజయం ఖాతాలో వేసుకుంది.

 గేల్ రికార్డు బ్రేక్:

గేల్ రికార్డు బ్రేక్:

ఈ మ్యాచ్‌లో ఏబీ డివీలియర్స్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 23 బంతుల్లో ఆఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 33 బంతుల్లో 73 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఏబీ.. 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. దీంతో ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో అత్యధికంగా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులను అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఏబీ 22 ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఈ మ్యాచుకు ముందు వరకు క‌రేబియ‌న్ స్టార్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (21)‌తో కలిసి సమానంగా ఉన్న ఏబీ.. తాజాగా అతన్ని అధిగమించాడు. ఐపీఎల్ 2020కి ముందు డివీలియర్స్‌ ఖాతాలో 20 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలు ఉన్నాయి.

ఏబీ@1

ఏబీ@1

ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్న ఆటగాడిగా ఏబీ డివీలియర్స్ (22) అగ్రస్థానంలో ఉన్నాడు. ఏబీ 161 ఐపీఎల్ మ్యాచులు ఆడి 4623 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 133 నాటౌట్. ఏబీ తర్వాత వరుసగా క్రిస్ గేల్ (21)‌, రోహిత్ శర్మ (18), డేవిడ్ వార్నర్ (17), ఎంఎస్ ధోనీ (17), షేన్ వాట్సన్ (16), యూసుఫ్ పఠాన్ (17)లు ఉన్నారు. రోహిత్, వార్నర్, వాట్సన్ ఈ సీజన్లో ఒక్కో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. గేల్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

నాలుగు ఫోర్లు, ఆరు సిక్సులు:

నాలుగు ఫోర్లు, ఆరు సిక్సులు:

ఈ మ్యాచ్‌లో మిస్టర్ 360 ఏబీ డివీలియర్స్‌ ‌ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సులు బాదాడు. ఆరు సిక్సులలో ఓ రెండు ఏకంగా స్టేడియం బయటకు వెళ్లాయి. 16వ ఓవర్‌లో కేకేఆర్‌ పేసర్ కమలేష్ నాగర్‌కోటి వేసిన నాలుగో బంతికి డివీలియర్స్‌ భారీ షాట్‌ ఆడగా.. బంతి స్టేడియం బయటకు వెళ్లింది. ఏబీ కొట్టిన ఆ సిక్స్ 86 మీటర్లు వెళ్లింది. షార్జా మైదానం చిన్నదిగా ఉండడంతో ఏబీ బాదిన బంతి.. రోడ్డుపై వెళుతున్న ఒక కారుకు తగిలింది. దీంతో ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

వరుసగా నాలుగు విజయాలు:

వరుసగా నాలుగు విజయాలు:

ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడిన రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివరిగా ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఏకంగా నాలుగు గెలవడం గమనార్హం. దాంతో పాయింట్ల పట్టికలోనూ కోహ్లీసేన నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. పాయింట్ల పట్టికలో చాన్నాళ్ల తర్వాత బెంగళూరు తమ జోరు కొనసాగిస్తోంది.

RCB vs KKR: దటీజ్‌ ఏబీ డివీలియర్స్‌ .. స్టేడియంలో కొడితే.. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ (వీడియో)

Story first published: Tuesday, October 13, 2020, 11:10 [IST]
Other articles published on Oct 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+