Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs CSK: బెంగళూరుదే బ్యాటింగ్.. ఇరు జట్లలో మార్పులు

Royal Challengers Bangalore, Chennai Super Kings

దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. తమ గత మ్యాచ్‌ అనుభవం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. పిచ్ పరిస్థితుల కారణంగా జట్టులో ఓ మార్పు చేసామని, ఉడానా స్థానంలో మోయిన్ అలీ జట్టులోకి వచ్చాడన్నాడు. ఇక గత రెండు మ్యాచ్‌ల్లో టాస్ విషయంలో తాము గందరగోళానికి గురయ్యామని ధోనీ తెలిపాడు. జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయని, శార్దుల్ ఠాకుర్, జోష్ హజెల్ వుడ్ స్థానాల్లో మిచెల్ సాంట్నర్, మోను కుమార్ తుది జట్టులోకి వచ్చారన్నాడు.

ముంబై ఇండియన్స్ చేతిలో 10 వికెట్లతో చిత్తయి అప్రతిష్ట మూటగట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ పరువు కోసం పాకులాడుతుంది. ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు కనీసం గౌరవంగానైనా తప్పుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్2‌లో నిలవాలని ఆర్‌సీబీ ఉవ్విళ్లూరుతోంది.

తుది జట్లు:

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గుర్‌క్రీత్ సింగ్, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, మొయిన్ అలీ, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, నదీమ్, యుజ్వేంద్ర చాహల్

చెన్నై సూపర్ కింగ్స్: ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, ఎన్ జగదీషన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, సామ్ కరన్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మోను కుమార్, మిచెల్ సాంట్నర్, ఇమ్రాన్ తాహిర్

Story first published: Sunday, October 25, 2020, 15:12 [IST]
Other articles published on Oct 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+