For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీచర్ హోం వర్క్ ఇచ్చినట్టు.. సిరాజ్‌కు ఏమాత్రం తెలియదు: రషీద్ ఖాన్ సెటైర్

IPL 2020: Rashid Khan trolls Mohammed Siraj over Virat Kohli’s school days post

హైదరాబాద్: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కోసారి చలాకీగా, మరోసారి దూకుడుగా, ఇంకొసారి గమ్మత్తుగా ప్రవర్తిస్తూ అందర్నీ నవ్విస్తుంటాడు. ఈ సీజన్లో ఇతర ఆటగాళ్ల శైలిని కూడా అనుకరిస్తూ అభిమానులను అలరించాడు. ఇక ఎప్పటిలాగే ఐపీఎల్ 2020లో తన ఆటతో అభిమానులను అలరిస్తోన్న కోహ్లీ.. మైదానం వెలుపల కూడా ఫ్యాన్స్‌ను నవ్వులో ముంచెత్తుతున్నాడు. తాజాగా విరాట్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

స్కూల్ డేస్‌ను గుర్తు చేస్తోంది

తనతో పాటు ఏబీ డివిలియర్స్, దేవదత్ పడిక్కల్, మొహ్మద్ సిరాజ్ నిలబడి ఉన్న ఫొటోను విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ఫొటో తనకు స్కూల్ డేస్‌ను గుర్తు చేసిందని పేర్కొన్నాడు. 'ఈ ఫొటో నా స్కూల్ డేస్‌ను గుర్తు చేస్తోంది. ఒకే క్లాస్‌కు చెందిన నలుగురు స్టూడెంట్స్. ఏబీ డివిలియర్స్ అనే పిల్లాడు మాత్రమే హోం వర్క్ చేసి సిద్ధంగా ఉన్నాడు. ఇబ్బందుల్లో ఉన్నామని మిగతా ముగ్గురికీ తెలుసు' అని సరదాగా ట్వీట్ చేశాడు. ఈ ఫొటోను కోహ్లీ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్టు చేశాడు.

రషీద్ ఖాన్ సెటైర్

రషీద్ ఖాన్ సెటైర్

విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై క్రికెటర్లు అందరూ స్పందిస్తున్నారు. కోహ్లీ ట్వీట్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఫన్నీగా స్పదించాడు. 'టీచర్ మనకు హోం వర్క్ ఇచ్చిందనే విషయమే సిరాజ్‌కు తెలీదు' అని సరదాగా సెటైర్ వేశాడు. బెంగళూరు స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కూడా సరదాగా స్పందించాడు. 'హోం వర్క్ చెక్ చేస్తారనే నేను క్లాస్‌కు వెళ్లడం ఎగ్గొట్టా' అని ట్వీట్ చేశాడు. నేనెప్పుడూ హోం వర్క్ టైంకు పూర్తి చేసేవాడినని పడిక్కల్ పేర్కొన్నాడు.

మర్చిపోయావా కోహ్లీ

మర్చిపోయావా కోహ్లీ

విరాట్ కోహ్లీకి సంబందించిన మరో వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గత మ్యాచులో కేకేఆర్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సీబీ చెదిస్తోంది. 13వ ఓవర్ల తర్వాత బెంగళూరు విజయానికి కేవలం 3 పరుగులు మాత్రమే అవసరం అయ్యాయి. ప్రసిద్ క్రిష్ణ వేసిన 14వ ఓవర్‌ తొలి బంతికి విరాట్ కోహ్లీ 2 పరుగులు తీశాడు. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. రెండో బంతి యార్కర్ పడగా.. పరుగేమి రాలేదు. ఒక పరుగు చేస్తే బెంగళూరు గెలిచినట్లే. అయితే మూడో బంతిని ఎదుర్కొన్న కోహ్లీ.. కీపర్ వెనకాలకు షాట్ ఆడాడు. ఒక పరుగు పూర్తి చేసిన కోహ్లీ.. మరో పరుగు కోసం పరుగులు పెట్టాడు. అవతలి బ్యాట్స్‌మన్‌ గుర్‌కీరత్‌మన్‌ సింగ్‌ కూడా పరుగు తీశాడు.

IPL 2020 : Virat Asked Siraj To Bowl Bouncer, But Siraj Made His Own Decision | RCB Vs KKR
టైటిల్‌ ఫేవరెట్‌గా

టైటిల్‌ ఫేవరెట్‌గా

ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో బంగలరు ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోంది. పది మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన కోహ్లీసేన ప్లేఆఫ్స్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది.అంతేకాదు టైటిల్‌ ఫేవరెట్‌గా మారింది. కోహ్లీ ఇటు కెప్టెన్‌గా, అటు బ్యాట్స్‌మన్‌గా అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో విరాట్ 10 మ్యాచ్‌ల్లో 365 పరుగులతో ఆ జట్టు తరపున​ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ సీఎస్‌కేతో అక్టోబర్ 25న తలపడనుంది.

RR vs SRH: హమ్మయ్యా.. మాకూ మిడిల్‌ ఆర్డర్‌ బలం ఉందని నిరూపించుకున్నాం: డేవిడ్ వార్నర్‌

Story first published: Friday, October 23, 2020, 12:41 [IST]
Other articles published on Oct 23, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+