For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs SRH: హమ్మయ్యా.. మాకూ మిడిల్‌ ఆర్డర్‌ బలం ఉందని నిరూపించుకున్నాం: డేవిడ్ వార్నర్‌

IPL 2020: David Warner says Its good to show people that we do have a middle-order

దుబాయ్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకూ మిడిల్‌ ఆర్డర్‌ బలం ఉందని అభిమానులకు చూపించడం బాగుందని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్ ఇద్దరూ బాగా ఆడారని ప్రశంసించాడు. టోర్నీలో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ సమిష్టిగా సత్తాచాటింది. మొదట బౌలింగ్‌లో జాసన్‌ హోల్డర్‌ దెబ్బకు స్వల్ప స్కోరుకే పరిమితమైన రాజస్థాన్‌.. ఆ తర్వాత పాండే, శంకర్‌ బ్యాటింగ్‌ జోరులో ఉక్కిరిబిక్కిరైంది. హ్యాట్రిక్‌ పరాజయాల తర్వాత కోలుకున్న వార్నర్‌ సేన పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.

150స్పీడ్‌తో బంతులేస్తుంటే ఏం చేయలేం

150స్పీడ్‌తో బంతులేస్తుంటే ఏం చేయలేం

మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌ మాట్లాడుతూ... 'మేం ప్రారంభించిన విధానం అద్భుతమని అనుకుంటా. పవర్‌ప్లే తర్వాత ఆటను మా చేతుల్లోకి తెచ్చుకోగలిగాం. ఇదొక సంపూర్ణ విజయం. విజయ్‌ శంకర్‌, మనీష్‌ పాండే రాణించడం బాగుంది. వాళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఐపీఎల్ అంటేనే ప్రపంచ శ్రేణి బౌలర్లతో తలపడే అవకాశం ఉంటుంది. అయితే బంతి స్వింగ్‌ అయ్యే అవకాశమూ ఉంది. దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక బౌలర్‌ 150 కిమీ వేగంతో బంతులేస్తుంటే ఏం చేయలేం. వీలైతే ఎదురుదాడి చేయాలి. నా విషయంలో మాత్రం ఔటయ్యా' అని తెలిపాడు.

మాకు మిడిల్‌ ఆర్డర్‌ బలం ఉంది

మాకు మిడిల్‌ ఆర్డర్‌ బలం ఉంది

'ట్రైనింగ్ సమయంలో మంచు బాగా ఉండడం చూసాం. మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా ఆ ప్రభావం కనిపించింది. అయినా మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. హైదరాబాద్‌ టీమ్‌కు జేసన్‌ హోల్డర్‌ అదనపు బలం. అతడు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు. జట్టుకు అతడో ఆల్‌రౌండ్‌ ప్యాకేజీలా ఉంటాడు. గత మ్యాచ్‌ల్లో మేము త్వరగా వికెట్లు కోల్పోలేదు. దాంతో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు సరైన అవకాశాలు రాలేదు. హైదరాబాద్‌ జట్టుకూ మిడిల్‌ ఆర్డర్‌ బలం ఉందని అభిమానులకు చూపించడం బాగుంది' అని వార్నర్‌ చెప్పుకొచ్చాడు.

మిడిల్‌ ఆర్డర్‌పై అనేక విమర్శలొచ్చాయి

మిడిల్‌ ఆర్డర్‌పై అనేక విమర్శలొచ్చాయి

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన మనీష్‌ పాండే స్పందిస్తూ... తమ జట్టు మిడిల్‌ ఆర్డర్‌పై అనేక విమర్శలొచ్చాయని, దాంతో తాను రాణించాలనుకున్నట్లు పేర్కొన్నాడు. వికెట్‌ కాపాడుకుంటూ షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఈ విజయంతో సంతోషంగా ఉందని, జోఫ్రా ఆర్చర్‌తో పాటు భారత బౌలర్లను ఎదుర్కోడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని మనీష్‌ వివరించాడు. విజయ్‌ తనకు సహకరించాడని, ఈ మ్యాచ్‌ నుంచి సానుకూల అంశాలు పరిగణనలోకి తీసుకొని మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇలాగే రాణించాలని ఉందన్నాడు.

IPL 2020 RR Vs SRH: Manish Pandey, Vijay Shankar Partnership | SRH 8 Wicket Win Vs RR
మనీష్‌ మెరుపులు

మనీష్‌ మెరుపులు

దుబాయ్‌ వేదికగా గురువారం రాత్రి టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. సంజూ శాంసన్ ‌(36; 26 బంతుల్లో 3x4, 1x6) టాప్‌ స్కోరర్‌. అనంతరం ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. మనీష్‌ పాండే (83*; 47 బంతుల్లో 4x4, 8x6), విజయ్‌ శంకర్ ‌(52*; 51బంతుల్లో 6x4) విజయాన్ని అందించారు.

RR vs SRH: ఆర్చర్‌కు ఇంకో ఓవర్ ఇవ్వాల్సింది.. పెద్దతప్పు చేశాం: స్మిత్

Story first published: Friday, October 23, 2020, 11:50 [IST]
Other articles published on Oct 23, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+