Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ మొదలవ్వకముందే రాజస్థాన్ రాయల్స్‌కు షాక్

IPL 2020: Rajasthan Royals Jofra Archer ruled out of the upcoming season

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ మొదలవ్వకముందే రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్, ఇంగ్లండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

గాయం నేపథ్యంలో గత రెండు నెలలుగా ఆటకు దూరమైన ఆర్చర్.. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో కూడా ఒకే మ్యాచ్ ఆడాడు. మిగతా మూడు టెస్ట్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అలాగే టీ20 సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు.

మూడు నెలలు ఆటకు దూరం..

మూడు నెలలు ఆటకు దూరం..

సౌతాఫ్రికా నుంచి ఇంగ్లండ్‌కు వచ్చిన ఆర్చర్‌కు బుధవారం స్కానింగ్ తీయగా.. అతని కుడి ఎల్బోలో ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. దీంతో అతను మరో మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతోనే ఆర్చర్ అపకమింగ్ శ్రీలంక టూర్‌తో పాటు ఐపీఎల్‌కు దూరంకానున్నాడు. మళ్లీ అతను జూన్‌లో వెస్టిండీస్‌తో జరిగే మూడు టెస్ట్‌ల సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

రాజస్థాన్‌కు బిగ్‌షాక్..

రాజస్థాన్‌కు బిగ్‌షాక్..

టైటిలే లక్ష్యంగా ఈ ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు జోఫ్రా ఆర్చర్ గాయంతో గట్టి షాక్ తగిలింది. ఆ టీమ్ వ్యూహాలను దెబ్బతీసింది. గత సీజన్‌లో జోఫ్రా అద్భుత ప్రదర్శన‌తో ఆకట్టుకున్నాడు. ఓవర్‌కు 6.76 పరుగుల చొప్పున ఇచ్చి 11 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని అద్భుత బౌలింగ్ జట్టు విజయాలకు కలిసొచ్చింది. దీంతో ఆర్చర్‌ను ఈ సీజన్‌కు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్.. మరోసారి అతని నుంచి అదే ప్రదర్శనను ఆశించింది. కానీ టోర్నీ మొదలవ్వకుండానే గాయంతో ఆర్చర్ సేవలను కోల్పోయింది.

టీ20 ప్రపంచకప్‌లోపు..

టీ20 ప్రపంచకప్‌లోపు..

మరోవైపు టీ20 ప్రపంచకప్‌లోపు జోఫ్రా ఆర్చర్ అందుబాటులోకి వస్తాడని ఇంగ్లండ్ టీమ్ భావిస్తోంది. ఇక వన్డే వరల్డ్‌కప్ ముందు పాకిస్థాన్‌తో ఒకే ఒక అంతర్జాతీయ టీ20 ఆడిన జోఫ్రా ఆర్చర్.. ఆస్ట్రేలియా వేదికగా జరిగే మెగాటోర్నీకి ముందు మరిన్ని మ్యాచ్‌లు ఆడాలని ఇంగ్లండ్ టీమ్‌మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. ఇక మొత్తం 95 టీ20లు ఆడిన ఈ కరేబియన్ స్టార్.. 121 వికెట్లు పడగొట్టాడు. ఇక అతని ఎకానమీ రేట్ కూడా 8 లోపే ఉండటం మరో విశేషం.

Story first published: Thursday, February 6, 2020, 16:53 [IST]
Other articles published on Feb 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+