Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: భారీగా తగ్గిన ప్రైజ్‌మనీ.. ఎంతో తెలుసా?

 IPL 2020 Prize Money Reduced To Half As BCCI Seeks Cost Cutting
IPL 2020 Prize Money Reduced To Half By BCCI | Oneindia Telugu

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతుందనగా ఫ్రాంచైజీలకు బీసీసీఐ దిమ్మతిరిగే షాకిచ్చింది. విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని సగానికి సగం తగ్గించేసింది. ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా ఫ్రాంచైజీలకు జారీ చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది.

విజేతకు రూ.10 కోట్ల కోత..

విజేతకు రూ.10 కోట్ల కోత..

‘ఖర్చులు తగ్గించే చర్యల్లో భాగంగా క్యాష్ రివార్డ్స్‌‌ను తగ్గించాం. ఈ సీజన్ చాంపియన్ జట్టు రూ.10కోట్ల ప్రైజ్‌మనీ అందుకోనుంది. గతంలో ఇది రూ.20కోట్లుగా ఉండేది. అలాగే రన్నరప్‌కు గతంలో రూ.12.5కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వగా.. ఈ ఏడాది రూ.6.25కోట్లు మాత్రమే గెలుచోనుంది.'అని తెలిపింది. ఇక మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు ఒక్కొక్కరికి రూ.4. 3కోట్ల చొప్పున ఇవ్వనున్నారు.

స్పాన్సర్ షిప్‌లున్నాయి...

స్పాన్సర్ షిప్‌లున్నాయి...

‘అన్ని ఫ్రాంచైజీలు మంచి వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. వారి ఆదాయాన్ని పెంచడం కోసం స్పాన్సర్‌షిప్ లాంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందుకే ప్రైజ్ మనీపై ఈ నిర్ణయం తీసుకున్నాం.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు. కాగా ఈ ఏడాది మార్చి 29నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్.. మే 24న ముగియనున్న విషయం తెలిసిందే.

నో కరోనా ఎఫెక్ట్..

నో కరోనా ఎఫెక్ట్..

ఐపీఎల్2020 సీజన్‌పై కరోనా ప్రభావం ఏ మాత్రం ఉండదని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. దేశంలో కొన్ని కరోనా కేసులు గుర్తించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌ల వల్ల ఈ మహమ్మారి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఐపీఎల్ నిర్వహించడం కష్టమేననే ఉహాగానాలు వినిపించాయి. అయితే ఇవన్నీ గాలి వార్తాలేనని బ్రిజేష్ కుమార్ మంగళవారం స్పష్టం చేశారు. కరోనా వైరస్ గురించి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్లు తెలిపాడు.

ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం ఈ ఊహాగానాలను ఖండించాడు. ఐపీఎల్‌కు సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు కరోనా వైరస్‌తో వచ్చే సమస్యే లేదన్నాడు. భారత్‌లో కరోనా వైరస్ ప్రభావం లేదని, దానిపై చర్చ కూడా అనవసరమని తెలిపాడు.

Story first published: Wednesday, March 4, 2020, 13:29 [IST]
Other articles published on Mar 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+