For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020 Playoffs: సన్‌రైజర్స్ మాయ.. ప్లేఆఫ్ రేసు నుంచి ఢిల్లీ లేదా బెంగళూరు ఔట్!!

IPL 2020 Playoffs Scenarios: RCB, DC elimination threat and KXIP, KKR, RR face must win games

హైదరాబాద్: అనూహ్య మలుపులు తిరుగుతున్న ఐపీఎల్‌ 2020లో మ్యాచ్‌ మ్యాచ్‌కు సమీకరణాలు మారిపోతున్నాయి. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరడం పక్కా అనిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ గాడితప్పి పరాజయాలను మూటగట్టుకుని ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటే.. ఇక ముందుకెళ్లడం కష్టమే అనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వరుస రెండు భారీ విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. దీంతో ఐపీఎల్ 2020 ప్లేఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీలో ఉన్నాయి.

చెన్నైపై నెగ్గితే

చెన్నైపై నెగ్గితే

లీగ్‌దశలో అన్ని జట్లు 13 మ్యాచ్‌లు ఆడేశాయి. ఇక అందరికీ మిగిలింది ఒక్క మ్యాచే. ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్ మాత్రమే ప్లేఆఫ్ చేరగా.. మిగతా మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీలో ఉన్నాయి. ఈరోజు సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిస్తే.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న పంజాబ్‌ చివరి మ్యాచ్‌లో చెన్నైపై నెగ్గితే మెరుగైన రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టొచ్చు. ఇక రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్లో గెలుపొందిన జట్టు నెట్ రన్ రేట్ ఆధారంగా మూడు లేదా నాలుగో స్థానానికి చేరుకుంటుంది. అయితే రన్‌రేట్‌ తక్కువగా ఉండటం ఆ జట్టును దెబ్బకొట్టొచ్చు.

ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగే సూచనలు

ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగే సూచనలు

గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిన ఢిల్లీ.. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓడిన బెంగళూరు జట్లలో ఒకటి ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగే సూచనలు ఉన్నాయి. సోమవారం ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు 16 పాయింట్లతో.. పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మాత్రం ప్లేఆఫ్ చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈరోజు పంజాబ్ గెలిచి, ముంబైతో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధిస్తే.. ఢిల్లీ లేదా బెంగళూరు జట్లలో ఒకటి ప్లేఆఫ్ చేరకుండానే ఎలిమినేట్ అవుతుంది. కోల్‌కతాపై రాజస్థాన్ ఘన విజయం సాధించి, బెంగళూరు లేదా ఢిల్లీ చిత్తుగా ఓడినా.. ఈ రెండు జట్లలో ఒకటి ఎలిమినేట్ అవుతుంది.

నిష్క్రమించొద్దంటే

నిష్క్రమించొద్దంటే

ఢిల్లీ, బెంగళూరు జట్లు రెండూ ప్లేఆఫ్ చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకూ పాయింట్ల పట్టికలో టాప్-3లో కొనసాగిన రెండు జట్లలో ఒకటి ప్లేఆఫ్ చేరకుండానే నిష్క్రమించొద్దంటే.. ఈరోజు పంజాబ్‌పై చెన్నై గెలవాలి. తర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కోల్‌కతా స్వల్ప తేడాతో గెలుపొందాలి. అప్పుడే బెంగళూరు, ఢిల్లీ రెండూ ప్లేఆఫ్ చేరుతాయి. అయితే సోమవారం మ్యాచ్‌లో ఓడిన జట్టు మాత్రం నాలుగో స్థానానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది.

RCB vs SRH: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌‌గా డివిలియర్స్ అరుదైన రికార్డు!

Story first published: Sunday, November 1, 2020, 11:30 [IST]
Other articles published on Nov 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+