RCB vs SRH: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా డివిలియర్స్ అరుదైన రికార్డు!

దుబాయ్: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట హైదరాబాద్ బౌలర్లు సమష్ఠిగా సత్తాచాటడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులే చేసింది. జోష్ ఫిలిప్ (32; 31 బంతుల్లో, 4×4) టాప్ స్కోరర్.
అనంతరం ఛేదనకు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 14.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వృద్ధిమాన్ సాహా (39; 32 బంతుల్లో, 4×4, 1×6), జాసన్ హోల్డర్ (26; 10 బంతుల్లో, 1×4, 3×6) సత్తాచాటారు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అరుదైన రికార్డు అందుకున్నాడు.

9 వేల రన్స్ మైలురాయి
శనివారం రాత్రి ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (24; 24 బంతుల్లో 1×4, 1×6) పర్వాలేదనిపించాడు. 24 పరుగులు చేసే క్రమంలో ఏబీ టీ20ల్లో 9 వేల రన్స్ మైలురాయిని చేరుకున్నాడు. దీంతో టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన తొలి దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తంగా టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన ఎనిమిదవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా తరపున ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మన్ కూడా ఇన్ని రన్స్ చేయలేదు.

గేల్@1
టీ20ల్లో 9వేల పరుగుల మైలురాయి అందుకున్న జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (13572) టాప్‌లో ఉన్నాడు. కీరన్ పొలార్డ్ (10425), షోయబ్ మాలిక్ (10145), బ్రెండన్ మెక్‌కల్లమ్ (9922), డేవిడ్ వార్నర్ (9712), విరాట్ కోహ్లీ (9324), ఆరోన్ ఫించ్ (9275)లు వరుసగా ఉన్నారు. వీరిలో మెక్‌కల్లమ్ మాత్రమే ఆటకు వీడ్కోలు పలికాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ 2020లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆర్‌సీబీ తరఫున ఆడిన 13 మ్యాచులలో 363 రన్స్ చేశాడు. ఇందులో మూడు మెరుపు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

సిగ్గుపడటం లేదు
మ్యాచ్ అనంతరం ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ... జోష్ ఫిలిఫ్, తాను వరుస ఓవర్లలో ఔటవడం మ్యాచ్‌ను మలుపు తిప్పిందన్నాడు. 'సన్‌రైజర్స్ బౌలర్లు మాపై ఒత్తిడి తెచ్చారు. ఫిలిఫ్, నేను వెనువెంటనే ఔటడంతో 20-30 పరుగులు తక్కువగా చేశాం. మేం 140 పరుగులు చేసినా.. మంచు ప్రభావంతో పిచ్ తడిగా మారడంతో అది కూడా సరిపోయేది కాదు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బాగా ఆడింది. ఆ జట్టు పెద్ద తప్పిదాలేం చేయలేదు. మేం మరింత బాగా ఆడాల్సిందని చెప్పడానికి సిగ్గుపడటం లేదు' అని తెలిపాడు.

ప్లేఆఫ్ రేసు రసవత్తరం
ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ విజయాలు అందుకోవడంతో ఐపీఎల్ 2020 ప్లేఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిన ఢిల్లీ.. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓడిన బెంగళూరు జట్లలో ఒకటి ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు 16 పాయింట్లతో.. పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది. ఇక ఓడిన జట్టుకు ప్లేఆఫ్ చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
RCB vs SRH: సన్‌రైజర్స్ ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్న విరాట్ కోహ్లీ!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications