ఐపీఎల్ 2020.. ఐదు రోజులకోసారి ఆటగాళ్లకు కరోనా పరీక్షలు!!

ముంబై: యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ జరగనున్న విషయం తెలిసిందే. పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ 2020ని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే బయో బబుల్ విధివిధానాల్ని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ అందజేసినట్లు సమాచారం తెలుస్తోంది. బీసీసీఐ సిద్ధం చేసిన ముసాయిదా ప్రకారం ఐపీఎల్ కోసం యూఏఈలో సాధన ఆరంభించాలంటే ముందుగా ఆటగాళ్లకి కనీసం అయిదుసార్లు కరోనా నెగెటివ్ రావాలి.

యూఏఈకి బయల్దేరే ముందు:
యూఏఈకి బయల్దేరే ముందు జట్టు యాజమాన్యం, ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని వారం రోజులు క్వారంటైన్‌లో ఉంచి రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండింటిలోనూ నెగటివ్ వచ్చిన వారు మాత్రమే యూఏఈకి బయల్దేరి వెళ్లనున్నారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే.. అతణ్ని 14 రోజులు క్వారంటైన్‌కు పంపిస్తారు. ఆ తర్వాత అతడు 24 గంటల వ్యవధిలో మరో రెండు కొవిడ్-19 ఆర్‌టీ-పీసీర్ పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్ వస్తే.. ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లడానికి అనుమతిస్తారు. ఐపీఎల్ కోసం యూఏఈకి వచ్చే విదేశీ ఆటగాళ్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.

వారం రోజుల వ్యవధిలో మూడు పరీక్షలు:
యూఏఈకి వెళ్లిన వెంటనే అక్కడ ఒకసారి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆపై 14 రోజులు క్వారంటైన్‌లో క్రికెటర్లని ఉంచనున్నారు. తొలి వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు పరీక్షలు చేయించుకొని అన్నీ నెగెటివ్‌గా తేలాలి. అప్పుడే బయో బబుల్‌లోకి చేర్చి ప్రాక్టీస్‌కు అవకాశం ఇస్తారు. ఈ వారం సమయంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఒకరితో మరొకరు కలవకూడదు. ఇలా మొత్తంగా ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందే ప్రతి క్రికెటర్‌కీ ఐదు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఐపీఎల్ జరిగే సమయంలో ప్రతీ 5వ రోజు క్రికెటర్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. యూఏఈ నిబంధనల ప్రకారం అవసరమైతే ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో కూడా టెస్టులు జరపవచ్చు.

బబుల్ నుంచి వెలుపలికి వస్తే:
బయో సెక్యూర్ బబుల్‌లోకి క్రికెటర్స్ ఎంటరైన తర్వాత.. వెలుపల వ్యక్తుల్ని కలిసేందుకు వారిని అనుమతించరు. ఒకవేళ క్రికెటర్ పొరపాటున ఆ బబుల్ నుంచి వెలుపలికి వస్తే అతడ్ని ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉంచి.. రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తారు. రెండింటిలోనూ నెగటివ్ వస్తేనే.. మళ్లీ బబుల్‌లోకి ఎంట్రీ ఇస్తారు. క్రికెటర్లతో పాటు మ్యాచ్ అధికారులు, ఫ్రాంఛైజీ అధికారులు, ట్రావెల్, హోటల్ సిబ్బంది ఇలా దాదాపు 500-600 మంది బబుల్‌లో ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే సమయంలోనూ క్రికెటర్లు వైరస్ బారిన పడే ప్రమాదం ఉన్నందున ప్రతి ఐదు రోజులకి ఒకసారి పరీక్షలు నిర్వహించనున్నారు.

కుటుంబ సభ్యులు కూడా:
'దుబాయ్‌లో అడుగుపెట్టిన తర్వాత తొలి వారం కూడా జట్టు యాజమాన్యం, ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఒకరిని ఒకరు కలుసుకోవడానికి వీల్లేదు. వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు నెగిటివ్ వస్తేనే వారిని బయో బబుల్‌లోకి అనుమతిస్తాం. విదేశాల నుంచి వచ్చే ఆటగాళ్లకూ ఇదే వర్తిస్తుంది. పొరపాటున బుడగ దాటి బయటకు వెళ్తే.. అలాంటి వారిని వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నాం' అని మంగళవారం ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఇక క్రికెటర్ల కుటుంబ సభ్యులను అనుమతించడంపై ఆయా ఫ్రాంచైజీలదే తుది నిర్ణయం. అయితే వారందరూ కూడా కచ్చితంగా బయో సెక్యూర్ నిబంధనలు పాటించాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఐపీఎల్‌కు అడ్డం లేకుండా.. ఆ రెండు సిరీస్‌లు వాయిదా!!