IPL 2020: బీసీసీఐకి ఊహించని షాక్.. ఐపీఎల్ 2020 ఆపాలంటూ పిటీషన్ దాఖలు!!

ముంబై: కరోనా వైరస్ కారణంగా దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ సాధ్యం కాదని.. యూఏఈ వేదికగా టోర్నీ నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లాన్ చేసింది. ఇందుకు భారత కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ 2020 జరిగేలా ఇప్పటికే ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించిన బీసీసీఐకి.. తాజాగా ఊహించని షాక్ తగిలింది. యూఏఈ వేదికగా టోర్నీ జరగకుండా ఆపాలంటూ బోంబే హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు అయింది.

బాంబే కోర్టులో పిటీషన్:
ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈ వేదికగా జరగకుండా నిలిపివేయాలని అడ్వకేట్ అభిషేక్ లాగో బోంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తాను ఓ పెద్ద క్రికెట్ అభిమాని అని అభిషేక్ అందులో పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిందని, ఐపీఎల్ 13 సీజన్‌ని యూఏఈలో నిర్వహిస్తే రెవెన్యూపరంగా దేశం ఇంకా నష్టపోతుందని పిటీషన్‌లో వెల్లడించారు. టోర్నీని యూఏఈలో కాకుండా భారత్‌లోనే నిర్వహించేలా బీసీసీఐకి ఆదేశాలు జారీ చేయాలని అడ్వకేట్ అభిషేక్ తన పిటీషన్‌లో కోరారు. ఐపీఎల్ 2019 సీజన్ నాటికి ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 475 మిలియన్‌గా పిటీషన్‌లో చెప్పారు.

నేడు విచారణ:
'ఐపీఎల్ 2020 ఛారిటీ ఈవెంట్ కాదు. కరోనా వైరస్ కారణంగా దేశంలోని అన్ని వ్యాపారాలు చాలా దెబ్బతిన్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాలేదు. చాలా మంది ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో భారత్‌లోనే ఐపీఎల్ 2020 మ్యాచ్‌లు నిర్వహిస్తే.. అది ఆర్థిక వ్యవస్థకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. 2019 సీజన్ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 475 మిలియన్లు. టోర్నీని యూఏఈలో కాకుండా భారత్‌లోనే నిర్వహించేలా బీసీసీఐకి ఆదేశాలు జారీ చేయాలి' అని అభిషేక్ లాగో తెలిపారు. ఈ పిటీషన్‌పై డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ దీపాంకత్ దత్తా, జస్టిస్ రేవతి మోహిత్ డేరా మంగళవారం విచారణ జరపనున్నారు.

సుమారు రూ.4000 కోట్లు:
ఐపీఎల్ 2020 సీజన్ రద్దయితే బీసీసీఐకి భారీ ఆదాయం పోనుంది. సుమారు రూ.4000 కోట్లు నష్టపోనుందని అంచనా. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయిలో ఉండటంతో.. యూఏఈ వేదికగా ఆ టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. యూఏఈ వేదికగా 53 రోజుల పాటు మొత్తం 60 మ్యాచ్‌లు జరగనుండగా.. ఇందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. టోర్నీలోని అన్ని జట్లు కూడా ఈ నెల 20 నుంచి యూఏఈకి వెళ్లబోతున్నాయి.
IPL 2020: టైటిల్ స్పాన్సర్ ఎవరో నేడు తేలనుంది.. రేసులో టాటా సన్స్ ముందంజ!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications