Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: టైటిల్ స్పాన్సర్ ఎవరో నేడు తేలనుంది.. రేసులో టాటా సన్స్ ముందంజ!!

IPL 2020 Title Sponsorship: BCCI likely to make announcement today

హైదరాబాద్: దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా చైనాకి చెందిన మొబైల్ కంపెనీ 'వివో'ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్ఫాన్సర్‌షిప్ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తప్పించిన విషయం తెలిసిందే. వివో స్థానంలో స్ఫాన్సర్‌షిప్ కోసం ఇప్పుడు భారత దేశానికి చెందిన పలు ప్రముఖ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఆయా కంపెనీలు బిడ్ దాఖలు చేశాయి.

రేసులో టాటా సన్స్:

రేసులో టాటా సన్స్:

టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం భారత్‌కి చెందిన టాటా సన్స్‌, రిలయన్స్ జియో, బైజూస్, అన్‌అకాడమీ తదితర కంపెనీలు బిడ్‌ దాఖలు చేశాయి. ఈరోజు బిడ్‌లను తెరవనున్న బీసీసీఐ.. స్ఫాన్సర్‌షిప్ దక్కించుకున్న కంపెనీ పేరుని అధికారికంగా ప్రకటించనుంది. స్ఫాన్సర్‌షిప్ రేసులో ప్రస్తుతం టాటా సన్స్ ఫస్ట్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టాటా సన్స్‌కు బైజూస్, రిలయన్స్ నుండి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు యోగాగురు బాబా రాందేవ్‌కి చెందిన 'ప‌తంజ‌లి' టైటిల్ స్పాన్సర్ రేసు నుండి ఇప్పటికే తప్పుకుంది.

సరిహద్దు వివాదం కారణంగా:

సరిహద్దు వివాదం కారణంగా:

ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. టైటిల్ స్ఫాన్సర్‌గా ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది కూడా వివోనే టైటిల్ స్ఫాన్సర్‌గా కొనసాగుతుందని.. మూడు వారాల క్రితం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. కానీ సరిహద్దు వివాదం కారణంగా బీసీసీఐ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. 'బాయ్‌కాట్ ఐపీఎల్'‌ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దాంతో వెనక్కి తగ్గిన బీసీసీఐ.. వివోతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.

రూ.300 కోట్లు టర్నోవర్ ఉండాలి:

రూ.300 కోట్లు టర్నోవర్ ఉండాలి:

వివో తప్పుకోవడంతో బీసీసీఐ కొత్తగా బిడ్స్‌ని ఆహ్వానించింది. కొత్త స్ఫాన్సర్‌ రూ.300-400 కోట్లు చెల్లించినా.. స్ఫాన్సర్‌షిప్‌ని ఇచ్చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే బిడ్ దాఖలు చేసే కంపెనీ టర్నోవర్ కనీసం రూ.300 కోట్లు ఉండాలని బీసీసీఐ ఓ నిబంధన పెట్టింది. అయితే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ మొత్తం వస్తుందా? లేదా? అన్నది అనుమమానంగానే ఉంది.

దసరా, దీపావళి వస్తుండటంతో:

దసరా, దీపావళి వస్తుండటంతో:

ఐపీఎల్ టోర్నీ సమయంలో దేశంలో పెద్ద పండగలు అయిన దసరా, దీపావళి వస్తుండటంతో.. టోర్నీ వ్యూవర్‌షిప్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో స్ఫాన్సర్‌షిప్‌ కోసం రూ.400 కోట్ల పైచిలుకు బిడ్ వేసిన కంపెనీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ మాత్రం కంపెనీ విలువలకి అధిక ప్రాధాన్యమివ్వబోతోందట. ఎక్కువ ధరకి బిడ్ వేసిన కంపెనీ కంటే.. మంచి విలువతో కూడిన కంపెనీకే స్ఫాన్సర్‌షిప్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి టైటిల్ స్పాన్సర్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Story first published: Tuesday, August 18, 2020, 10:47 [IST]
Other articles published on Aug 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+