Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా బాటలోనే ఇతర ఆటగాళ్లు: ప్యాడీ ఆప్టన్

IPL 2020: Paddy Upton Says Number of other players in ‘same boat’ as Suresh Raina

న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలతో టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేశ్ రైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే సమీప భవిష్యత్తులో మరింత మంది ఆటగాళ్లు సురేశ్ బాటలోనే నడిచే అవకాశం ఉందని భారత మాజీ మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ అన్నాడు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించే ఆలోచనలో చాలా మంది ఆటగాళ్లున్నారని, వారి గురించి ఆయా జట్లకు తెలిసే ఉంటుందని, అలా జరగకుండా చర్యలు కూడా తీసుకుంటున్నారని ఆశిస్తున్నట్లు ఈ భారత మాజీ కోచ్ తెలిపాడు.

అనూహ్య ఘటనలెన్నో..

అనూహ్య ఘటనలెన్నో..

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ ఫో వేదికగా ‘ఆటగాళ్ల మానసిక స్థితి'అనే అంశంపై జరిగిన చర్చలో ఎన్నో జట్లకు మానసిక కోచ్‌గా పనిచేసిన ప్యాడీ ఆప్టన్ పాల్గొన్నాడు. చుట్టూ నెలకొన్న పరిస్థితులతో ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కోనున్నారని చెప్పాడు. ఈ సీజన్ జరిగే క్రమంలో ఊహించిన ఘటనలతో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందన్నాడు. ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కే జట్లే మెరుగ్గా రాణించగలవన్నాడు.

ప్రేక్షకుల్లేరు ఎలానో..

ప్రేక్షకుల్లేరు ఎలానో..

‘స్టార్ ఆటగాళ్లు మైదానంలోని అభిమానుల సమక్షంలో ఒత్తిడిని సవాల్‌గా తీసుకుంటూ మరింత చెలరేగుతారు. అయితే ఖాళీ మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ఎవరూ ఎలాంటి ఆటగాళ్లో తెలిసిపోనుంది. విరాట్ కోహ్లీ ఒత్తిడిలో మరింత రాణిస్తాడు. ప్రేక్షకుల అరుపులతో మరింత ఉత్సాహంగా ఆడుతాడు. అంతర్గతంగా ప్రశ్నించుకునే ఆటగాళ్లు తమకు తాము స్పూర్తిని నింపుకుంటారు. వారు బాగానే ఉంటారు. అద్భుతంగా రాణిస్తారు.'అని ఆప్టన్ తెలిపాడు.

సమీప భవిష్యత్తులో..

సమీప భవిష్యత్తులో..

ఇక ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ఆయా జట్లు తమ ఆటగాళ్లను మానసికంగా సిద్దం చేసి ఉంటాయని తాను అనుకుంటున్నట్లు ఆప్టన్ తెలిపాడు. అలాగే సురేశ్ రైనా బాటలోనే మరి కొంతమంది ఆటగాళ్లు నడిచే అవకాశం ఉందన్నాడు. ‘సమీప భవిష్యత్తులో మరికొంత మంది ఆటగాళ్లు సురేశ్ రైనా బాటలో నడిచే అవకాశం ఉంది. అయితే ఆ ఆటగాళ్లు ఎవరా? అనే విషయం ఫ్రాంచైజీలకు తెలిసే ఉంటుంది. వారు ఇప్పటికే అలా జరగకుండా తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా'అని ఆప్టన్ చెప్పుకొచ్చాడు.

డబ్బు ముఖ్యం కాదు..

డబ్బు ముఖ్యం కాదు..

ఆటగాళ్లలో స్పూర్తి నింపడానికి డబ్బు పనికిరాదని, సురేశ్ రైనా భారీ మొత్తంలో నష్టపోతానని తెలిసే ఆ నిర్ణయం తీసుకున్నాడని ఈ మాజీ మెంటల్ కండీషనింగ్ కోచ్ తెలిపాడు.

‘డబ్బుకు ప్రభావితమయ్యే ఆటగాళ్లు చాలా తక్కువ. ఆటగాళ్లను మోటివేట్ చేయడానికి అది కొంతవరకు పనిచేస్తోంది. కానీ సురేశ్ రైనా వ్యవహారంలో అతను డబ్బును ఏం మాత్రం లెక్కచేయలేదు. లీగ్ నుంచి తప్పుకుంటే ఎంత నష్టపోతాడో రైనాకు బాగా తెలుసు. అయినా అతను నిర్ణయం తీసుకున్నాడు. రైనా నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది'అని ఆప్టన్ చెప్పుకొచ్చాడు.

మా మామను అతి కిరాతకంగా చంపారు.. హంతకులను వదలవద్దు: సురేశ్ రైనా

Story first published: Tuesday, September 1, 2020, 14:53 [IST]
Other articles published on Sep 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+