For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs MI: డికాక్ కామెడీ ఔట్ .. బంతిని కాలితో తన్నబోయి!!

IPL 2020: Mumbai Indians wicketkeeper Quinton de Kock comedy dismissal against Delhi capiatals match

హైదరాబాద్: శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని ముంబై 14.2 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇషాన్‌ కిషన్ ‌(72 నాటౌట్:‌ 47 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధ శతకంతో రాణించడంతో ముంబై అలవోకగా విజయం సాధించింది. క్వింటన్‌ డికాక్ ‌(26) ఫర్వాలేదనిపించాడు. అంతకుముందు జస్ప్రీత్ బుమ్రా (3/17), ట్రెంట్‌ బౌల్ట్ ‌(3/21) దెబ్బకు ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ ‌(25), వికెట్ కీపర్ రిషబ్‌ పంత్ ‌(21) మాత్రమే పోరాడారు.

కామెడీ ఔట్

కామెడీ ఔట్

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ కామెడీగా ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన అన్రిచ్ నోర్జ్ బౌలింగ్‌లో బంతిని ముందుకు ఫుష్ చేసేందుకు డికాక్ ప్రయత్నించాడు. కానీ ఎక్స్‌ట్రా బౌన్స్ కారణంగా.. బంతిని డికాక్ ఆశించిన విధంగా ఫుష్ చేయలేకపోయాడు. దాంతో బ్యాట్ అంచును తాకిన బంతి క్రీజులో పడింది. ఒక్కసారిగా బంతి బౌన్స్ అయ్యి.. నేరుగా వికెట్లపై పడింది. బంతి వికెట్లపై పడబోతోందని ముందే పసిగట్టిన డికాక్.. దానికి ఆపేందుకు ట్రై చేశాడు. కానీ అప్పటికే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో డికాక్ నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

వికెట్లని కాలితో తన్నుతూ

వికెట్లని కాలితో తన్నుతూ

అక్టోబరు 1న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందిన తర్వాత.. క్వింటన్ డికాక్ ఉద్దేశపూర్వకంగా వికెట్లని కాలితో తన్నుతూ కనిపించాడు. దాంతో డికాక్‌ ఔటైన తీరుపై ఇప్పుడు అభిమానులు సెటైర్లు పేలుస్తున్నారు. తాజా కామెడీ రనౌట్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫాన్స్ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'డికాక్‌.. పక్కన పడిన బంతిని కూడా ఆపలేకపోతున్నావ్' అని సెటైర్లు వేస్తున్నారు.

మెరుపు స్టంపింగ్

మెరుపు స్టంపింగ్

అయితే ఈ మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ కామెడీ తరహాలో రనౌట్ అయినా.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లానే మెరుపు స్టంపింగ్ చేశాడు. 11వ ఓవర్ వేసిన రాహుల్ చహర్ బౌలింగ్లో మెరుపు స్టంపింగ్ చేశాడు. కీలక సమయంలో ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను పెవిలియన్ చేర్చాడు. 11వ ఓవర్ రెండో బంతికి కాలిని ముందుకేసి అయ్యర్ షాట్ ఆడాడు. ఆ బంతి బ్యాటుకు కనెక్ట్ కాలేదు. అదే సమయంలో క్రీజులో ఉన్న ఇంకో కాలు కొన్ని సెకండ్ల పాటు మాత్రమే గాల్లో లేచింది. అదే సమయంలో డికాక్ రెప్పపాటులో స్టంపింగ్ చేశాడు. దీంతో అయ్యర్ ఔట్ అయ్యాడు.

ముంబై మాత్రమే

ముంబై మాత్రమే

ఐపీఎల్ 2020 ప్లేఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్ మాత్రమే ప్లేఆఫ్ చేరగా.. మిగతా మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీలో ఉన్నాయి. ఈరోజు చెన్నైతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే.. టాప్-2లోకి చేరుకుంటుంది. కోల్‌కతా, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌లు గెలుపొందిన జట్టు నెట్ రన్ రేట్ ఆధారంగా మూడు లేదా నాలుగో స్థానానికి చేరుకుంటుంది. మొత్తానికి ఈరోజు ప్లేఆఫ్ విషయంపై కొంత క్లారిటీ రానుంది.

ప్లాన్ ప్రకారం షార్ట్ పిచ్ బంతి.. సాహా భారీ సిక్సర్.. కోహ్లీ షాక్.. ఆ తర్వాత!!

Story first published: Sunday, November 1, 2020, 15:12 [IST]
Other articles published on Nov 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+