Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లాన్ ప్రకారం షార్ట్ పిచ్ బంతి.. సాహా భారీ సిక్సర్.. కోహ్లీ షాక్.. ఆ తర్వాత!!

IPL 2020: Wriddhiman Saha smashes huge sixer in Mohammed Siraj bowling, Virat Kohli in Shock

షార్జా: శనివారం రాత్రి షార్జా వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులే చేసింది. జోష్‌ ఫిలిప్‌ (32; 31 బంతుల్లో, 4×4) ఫర్వాలేదనిపించాడు. లక్ష్య ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్‌ 14.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా (39; 32 బంతుల్లో, 4×4, 1×6), జాసన్‌ హోల్డర్‌ (26; 10 బంతుల్లో, 1×4, 3×6) రాణించారు. డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఔటైనా.. సాహా అద్భుతంగా ఆడి విజయానికి బాణాలు వేశాడు.

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్ బాధ్యతను భుజాన వేసుకున్న వృద్ధిమాన్‌ సాహాను ఎలా అయినా ఔట్ చేయాలని బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ ఓ వ్యూహం పన్నాడు. అయితే అది కోహ్లీకె షాక్ ఇచ్చింది. ఇన్నింగ్స్ 6వ ఓవర్‌ వేసేందుకు మన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ చేతికి కోహ్లీ బంతిని ఇచ్చాడు. సాహా కోసం షార్ట్ పిచ్ బంతి ప్లాన్ వేశాడు. అప్పటి వరకూ సాహా స్ట్రైక్ రొటేట్ చేస్తుండడంతో.. ఓ షాట్‌ ఆడేలా షార్ట్ పిచ్ బంతిని ప్లాన్ చేశాడు. అందుకు తగినవిధంగా డీప్ స్వ్కేర్ లెగ్‌లోనూ ఫీల్డర్‌ని కూడా ఉంచాడు. షార్ట్ పిచ్ బంతిని విసిరితే దాన్ని సాహా ఫుల్ చేస్తాడని కోహ్లీ ఊహించాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పినట్లే మహ్మద్ సిరాజ్ 138.9 కిమీ వేగంతో షార్ట్ పిచ్ బంతిని సంధించాడు. ఆ బంతిని వికెట్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా డీప్ స్వ్కేర్ లెగ్‌ దిశగా ఫుల్ చేశాడు. బ్యాట్‌కి సరిగ్గా కనెక్ట్ కావడంతో.. బంతి స్టేడియం బయట పడింది. 69 మీటర్ల దూరం వెళ్లింది. దాంతో కోహ్లీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ షాట్ ఊహించని విరాట్ నమ్మలేనట్లు అలా చూస్తుండిపోయాడు. మరోవైపు సిరాజ్ కూడా ఆ బంతిని చూస్తూ ముందుకువెళ్లిపోయాడు. ఆ తర్వాత మరోసారి ఆ బంతులు వెయ్యొద్దని సిరాజ్‌కి కోహ్లీ చెప్పాడు.

ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో మరోసారి వృద్ధిమాన్‌ సాహా ఔట్ కోసం ప్లాన్ చేసిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ ఈసారి మాత్రం సక్సెస్ అయ్యాడు. ఆ ఓవర్‌కు ముందు ఏబీ డివిలియర్స్‌, యజ్వేంద్ర చహల్‌తో కోహ్లీ మాట్లాడాడు. ఆ ఓవర్ చివరి బంతిని చహల్‌ ఆఫ్ స్టంప్‌ వెలుపలకు కట్ చేసే ప్రయత్నం చేశాడు. క్రీజు వెలుపలికి వచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సాహా.. స్టంపౌట్ అయ్యాడు. ఒకసారి విఫలమయిన కోహ్లీ.. రెండోసారి మాత్రం సక్సెస్ అయ్యాడు. మొత్తానికి సాహాను ఔట్ చేశాడు.

Story first published: Sunday, November 1, 2020, 13:07 [IST]
Other articles published on Nov 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+