Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK: ధోనీ ఆ ఒక మార్పు చేస్తే చాలు.. ఫామ్ అందుకుంటాడు: అగార్కర్

IPL 2020: MS Dhoni shouldn’t be batting lower than No.5 says Ajit Agarkar

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌. మూడుసార్లు విజేత.. ఐదుసార్లు రన్నరప్​ అయిన చెన్నై స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యట్లేదు. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దాదాపు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే ఈ సీజన్‌లో ధోనీసేనకు ఏదీ కలిసి రాలేదు. లీగ్‌లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు పేరుకు ఈసారి మూడు మ్యాచ్‌లు గెలిచినా.. ఒక్కసారి కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. అసలు చెన్నై ఇంత దయనీయమైన పరిస్థితి ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించలేదు.

కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిమాండ్

కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిమాండ్

ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మార్క్ కనపడడం లేదు. ఆటతీరు పేలవంగా ఉండటం.. కెప్టెన్సీలో మునుపటి చురుకుదనం లేకపోవడంతో తీవ్ర స్థాయిలో ధోనీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో దిగువకు రావడం పెద్ద చర్చనీయాంశం అయింది. సామ్ కరన్, రవీంద్ర జడేజాల తర్వాత క్రీజులోకి వస్తుండడంతో మాజీలు కూడా విమర్శించారు. ఇక పరుగులు చేయని ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంతో చెన్నై అభిమానులే అతనిపై మండిపడ్డారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు.

చిన్న మార్పు చేస్తే

చిన్న మార్పు చేస్తే

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ మాత్రం ఎంఎస్ ధోనీకి మద్దతుగా నిలిచాడు. ధోనీ ఒక చిన్న మార్పు చేస్తే సరిపోతుందని, ఫామ్ అందుకుంటాడని చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్ ఫ్యాన్ వీక్‌లో అగర్కార్ మాట్లాడుతూ... 'నా అభిప్రాయం ప్రకారం ఎంఎస్ ధోనీ ఐదో స్థానం కంటే దిగువన బ్యాటింగ్ చేయకూడదు. మ్యాచ్ పరిస్థితిని బట్టి మహీ బ్యాటింగ్‌కు దిగే స్థానాన్ని మార్చుకోవచ్చు. కానీ ఐదో స్థానం కంటే దిగువన మాత్రం ఆడొద్దు' అని సలహా ఇచ్చాడు.

IPL 2020 : Criticism On Ms Dhoni For His Comments On Young CSK Players | CSK | Oneindia Telugu
గొప్ప క్రికెట్ బ్రెయిన్లలో ఒకడు

గొప్ప క్రికెట్ బ్రెయిన్లలో ఒకడు

'ప్రపంచంలోని గొప్ప క్రికెట్ బ్రెయిన్లలో ఎంఎస్ ధోనీ ఒకడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి విషయాన్నీ గమనిస్తాడు. ఇతర ఆటగాళ్లు అంచనా వేయలేకపోయినా.. ధోనీ పరిస్థితులకు తగ్గట్టుగా అంచనాలు వేస్తాడు. టోర్నీ గడిచే కొద్దీ అతడు ఫామ్ అందుకుంటాడు' అని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఓడితే కనుక చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.

IPL 2020: కోల్‌కతా జట్టులోకి న్యూజిలాండ్‌ హార్డ్ హిట్టర్‌!!

Story first published: Wednesday, October 21, 2020, 17:26 [IST]
Other articles published on Oct 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+