For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ 60 రోజులు మంచానికే పరిమితమయ్యా.. బంతిని పక్కనే పెట్టుకొని పడుకున్నా: షమీ భావోద్వేగం

IPL 2020: Mohammed Shami breaks silence on 2015 knee injury, retirement talks

దుబాయ్: 2015, 2018లో తాను గాయాలపాలయ్యానని. అప్పుడు అందరూ తన పనైపోయిందన్నారని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్‌ షమీ తెలిపాడు. ఇప్పుడు మీరు చూస్తున్న షమీకి.. గతంలో షమీకి చాలా తేడా ఉందని పేర్కొన్నాడు. గాయాల పాలై కొంతకాలం క్రికెట్‌కు దూరమైనప్పుడు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను షమీ తాజాగా గుర్తు చేసుకొని భావోద్వేగం చెందాడు. ఏ క్రీడాకారుడికీ అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని టీమిండియా పేసర్ కోరుకున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన 2015 ప్రపంచకప్‌లో షమీ గాయంతోనే ఆడి అద్భుత ప్రదర్శన చేసాడు.

నా పనైపోయిందన్నారు

నా పనైపోయిందన్నారు

తాజాగా మహ్మద్‌ షమీ 'ఆమ్‌స్ట్రాడ్ ఇన్సైడ్ స్పోర్ట్' ఫేస్ 2 ఫేస్ క్రికెట్ సిరీస్‌లో మాట్లాడుతూ.... 'నాకు ఇంకా బాగా గుర్తుంది. 2015, 2018లో నేను గాయాలపాలయ్యాను. అప్పుడు అందరూ షమీ పనైపోయిందన్నారు. తిరిగి మైదానంలో రాణించలేనని వార్తలు కూడా రాశారు. ఆ సమయంలో ఎంతో ఆవేదనకు గురయ్యా. దాదాపు 60 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యాను. ఆ సమయంలో బంతిని నా పక్కనే పెట్టుకొని పడుకునేవాడిని' అని తెలిపాడు.

 రిటైర్మెంట్‌కు దగ్గరపడ్డట్లుగా అనిపించింది

రిటైర్మెంట్‌కు దగ్గరపడ్డట్లుగా అనిపించింది

'గాయంకు అయిన చికిత్స ముగిసే సమయానికి నా బరువు 95 కిలోలకు చేరుకుంది. నిజానికి ఒక క్రీడాకారుడికి అలాంటి పరిస్థితి ఎదురవడం చాలా ఇబ్బందికరం. క్రికెటర్‌కు‌ ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం. గాయాల నుంచి కోలుకున్న తర్వాత నాకు ఫిట్‌నెస్‌ కోల్పోయిన భావన కలిగింది. ఒక్కో సమయంలో రిటైర్మెంట్‌కు దగ్గరపడ్డట్లుగా అనిపించింది. తిరిగి మైదానంలో దిగాలని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి ప్రతి క్షణాన్ని సాధనకే కేటాయించా. కొంతమంది విమర్శించినట్లు నేను మునుపటి లాంటి వ్యక్తిని కాను. అప్పటికీ ఇప్పటికీ నాలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం నేను చాలా ఫిట్‌గా ఉన్నాను' అని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్‌ షమీ చెప్పుకొచ్చాడు.

నాలుగు మ్యాచుల్లో 8 వికెట్లు

నాలుగు మ్యాచుల్లో 8 వికెట్లు

ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ తరఫున మహ్మద్‌ షమీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు బౌలింగ్‌ విభాగంలో టాప్ ‌గేర్‌లో దూసుకెళుతున్నాడు. నాలుగు మ్యాచుల్లో 7.86 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. టీమిండియానూ షమీ ప్రధాన పేసర్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. భారత జట్టు తరఫున 49 టెస్టుల్లో 180 వికెట్లు తీసిన షమీ.. 77 వన్డేల్లో 144 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇక 11 టీ20ల్లో 12 వికెట్లు తీశాడు.

మోకాలి గాయంతోనే

మోకాలి గాయంతోనే

2015 ప్రపంచకప్‌లో మహ్మద్‌ షమీ గాయంతోనే ఆడి అద్భుత ప్రదర్శన చేసాడు. ఆ ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌లాడిన షమీ.. 17.29 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. మెగా టోర్నీలో ఉమేష్ యాదవ్ (18) తర్వాత అత్యధిక వికెట్లు (17) తీసిన భారత బౌలర్ షమీనే. ఇక టోర్నిలో నాలుగవ స్థానంలో ఉన్నాడు. అయితే టోర్నీ ఆసాంతం మోకాలి గాయంతోనే ఆడాడు. మ్యాచ్‌కి ముందు బౌలింగ్ చేయలేనని అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెప్పినా.. జట్టు కోసం అతడిని గాయంతోనే ఆడించారు.

RCB vs RR: వాట్ ఏ షాట్ మామ.. యువరాజ్ సిక్స్ హిట్టింగ్ ఛాలెంజ్‌కు బదులిచ్చిన పడిక్కల్!!

Story first published: Sunday, October 4, 2020, 16:27 [IST]
Other articles published on Oct 4, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+