For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs RR: వాట్ ఏ క్యాచ్ మామ.. పడిపోతుంటే పట్టుకున్నాడు.. పొలార్డ్ మాత్రమే అలాంటివి పట్టగలడు!!

IPL 2020, MI vs RR: Kieron Pollard takes blinder to dismiss Jos Buttler, Sachin Praising him
IPL 2020,MI vs RR : Pollard Took An Unbelievable Catch To Dismiss Jos Buttler || Oneindia Telugu

అబుదాబి: మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై.. సూర్యకుమార్ యాదవ్ (79*, 47 బంతుల్లో, 11×4, 2×6) అజేయ అర్ధ శతకంతో రాణించడంతో నాలుగు వికెట్లకు 193 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 18.1 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్ అయింది.జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. జోస్ బట్లర్‌ (70; 44 బంతుల్లో, 4×5, 5×6) హాఫ్ సెంచరీ వృధా అయింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా మూడో విజయం.

బట్లర్ పోరాటం:

బట్లర్ పోరాటం:

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్‌ కీరన్ పొలార్డ్ అద్భుతం చేశాడు. కీలక సమయంలో స్టన్నింగ్ క్యాచ్ పట్టి మ్యాచ్‌ను ఒక్కసారిగా ముంబై వైపు తిప్పాడు. ముంబై నిర్దేశించిన 194 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ 12 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఓపెనర్ జోస్‌ బట్లర్, మహిపాల్‌ లామ్రోర్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదు ఓవర్ల పాటు ఈ ఇద్దరు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇక్కడే బట్లర్ గేర్ మార్చాడు. బౌండరీలు, సిక్కులు బాదుతూ ఊపులోకి వచ్చాడు. ఈ దశలో లామ్రోర్‌ (11) వికెట్ చేజార్చుకున్నాడు.

 రెండో ప్రయత్నంలో పట్టాడుగా:

రెండో ప్రయత్నంలో పట్టాడుగా:

ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు జోస్ బట్లర్ ఒంటరి పోరాటం చేశాడు. 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 44 బంతుల్లో 70 పరుగులు చేశాడు. పోరాడుతున్న బట్లర్‌ను 14వ ఓవర్‌లో జేమ్స్ పాటిన్సన్‌ ఔట్‌ చేశాడు. 14వ ఓవర్ రెండో బంతిని బట్లర్ భారీ షాట్ ఆడగా.. లాంగ్ ఆన్‌లో సిక్స్ వెళ్లేలా కనిపించింది. బౌండరీ వద్దే ఫీల్డింగ్ చేస్తున్న ‌కీరన్ పొలార్డ్.. అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అందుకోబోయాడు. అయితే బంతి అతని చేతిని నుంచి జారిపోతూ మోచేతికి తగిలి కిందపడబోయింది. రెండో ప్రయత్నంలో ఆ బంతిని పొలార్డ్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో బట్లర్‌ పోరాటం ముగిసింది. రాజస్థాన్ భారీ తేడాతో ఓడింది.

ముందుకు దూకుతూ 'రాయ్' సూపర్ క్యాచ్:

ముందుకు దూకుతూ 'రాయ్' సూపర్ క్యాచ్:

ముంబై ఆటగాడు అనుకుల్ రాయ్ కూడా ఓ సూపర్ క్యాచ్ పట్టాడు. 9వ ఓవర్ మొదటి బంతికి మహిపాల్‌ లామ్రోర్‌ భారీ షాట్ ఆడగా.. బంతి గాల్లోకి లేచింది. సర్కిల్ వెలుపలికి పరుగెత్తుకుంటూ వచ్చిన అనుకుల్.. ఒక్కసారిగా ముందుకు దూకుతూ బంతిని అందుకున్నాడు. ఇంకేముంది లామ్రోర్‌ నిరాశగా పెవిలియన్ చేరాడు. పక్కనే ఉన్న కీరన్ పొలార్డ్.. అనుకుల్‌ను అభినందించాడు. కీలక వికెట్ కోల్పోవడంతో ముంబై ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

పొలార్డ్ మాత్రమే అలాంటి క్యాచ్‌లు పట్టగలడు:

పొలార్డ్ మాత్రమే అలాంటి క్యాచ్‌లు పట్టగలడు:

కీరన్ పొలార్డ్, అనుకుల్‌లకు సంబందించిన క్యాచ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలు చూసిన ఫ్యాన్స్ 'వాట్ ఏ క్యాచ్ మామ', 'స్టన్నింగ్ క్యాచ్' అంటూ పొగిడేస్తున్నారు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఇద్దరినీ ప్రశంసించాడు. 'కీరోన్ పొలార్డ్ మాత్రమే అలాంటి క్యాచ్‌లు పట్టగలడు' అని ట్వీట్ చేశాడు. 'అనుకుల్ రాయ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ముందుకు దూకుతూ క్యాచ్ పట్టడం ఇప్పటికే కష్టమే' అని సచిన్ ట్వీటాడు.

ధోనీ ఎప్పుడూ అలానే చేస్తుంటావ్.. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం: పాంటింగ్!! అసలు ట్విస్ట్ ఇక్కడే

Story first published: Wednesday, October 7, 2020, 8:38 [IST]
Other articles published on Oct 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+