MI vs RR: ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన జస్ప్రీత్ బుమ్రా!!

దుబాయ్: ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో పోటీ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా టీ20ల్లో ప్రతి బంతిని ఎంతో విలువైనదిగా అన్ని జట్లు భావిస్తున్నాయి. అలాంటి పొట్టి ఫార్మాట్‌లో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. తన అద్భుత బౌలింగ్ సామర్యంతో దూసుకుపోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చాలా కాలం నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న బుమ్రా.. ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో కూడా ఎలాంటి బ్యాట్స్‌మన్‌ను అయినా బోల్తా కొట్టించడం బుమ్రా ప్రత్యేకత. మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా క్లాస్ ప్రదర్శన చేశాడు.

ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు:
రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు. స్టీవ్ స్మిత్ (6), రాహుల్ తెవాటియా (5), జోఫ్రా ఆర్చర్ (24), శ్రేయాస్ గోపాల్ (1)లను ఔట్ చేశాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 4 వికెట్లు తీసి 20 పరుగులు ఇచ్చాడు. దీంతో బుమ్రా ఐపీఎల్‌లో తన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 13 పరుగులు ఇచ్చి 3 మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

మూడు ఓవర్లలో 8 పరుగులే:
జస్ప్రీత్ బుమ్రా తన మొదటి మూడు ఓవర్లలో కేవలం 8 పరుగులు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మొదటి ఓవర్లో స్టీవ్ స్మిత్ వికెట్ తీసి 2 రన్స్ ఇచ్చాడు. రెండో ఓవర్లో 4 పరుగులు సమర్పించుకున్నాడు. మళ్లీ 16వ ఓవర్ వేసిన బుమ్రా.. రాహుల్ తెవాటియా, శ్రేయాస్ గోపాల్ వికెట్లు తీసి రెండు 2 రన్స్ ఇచ్చాడు. ఇక 18 ఓవర్లో జోఫ్రా ఆర్చర్ రెండు బౌండరీలు బాదడంతో 12 పరుగులొచ్చాయి. చివరి బంతిని అతన్ని ఔట్ చేసి నాలుగో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.

నాలుగేసిన పేస్ గుర్రం:
మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. సూర్యకుమార్ యాదవ్ (79*, 47 బంతుల్లో, 11×4, 2×6) అజేయ అర్ధ శతకంతో రాణించడంతో నాలుగు వికెట్లకు 193 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 18.1 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్ అయింది.జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. జోస్ బట్లర్ (70; 44 బంతుల్లో, 4×5, 5×6) హాఫ్ సెంచరీ వృధా అయింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా మూడో విజయం.

రీ ఎంట్రీ తర్వాత విమర్శలు:
నిజానికి వెన్నులో చిలీకతో జస్ప్రీత్ బుమ్రా గతేడాది కొంతకాలం క్రికెట్‌కు దూరమయ్యాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అతడు టీమిండియా తరపున ఎక్కువగా బరిలోకి దిగలేదు. అనంతరం కోలుకుని గత జనవరిలో శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి రీ ఎంట్రీ తర్వాత బుమ్రా మునుపటి వాడిని చూపించేలేకపోయాడు. కివీస్‌తో జరిగిన సిరీస్లో అయితే ధారళంగా పరుగులిచ్చాడు. దీంతో విమర్శల పాలయ్యాడు. ఆపై కరోనాతో వచ్చిన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని ఫిట్‌నెస్ సాదించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు.
MI vs RR: వాట్ ఏ క్యాచ్ మామ.. పడిపోతుంటే పట్టుకున్నాడు.. పొలార్డ్ మాత్రమే అలాంటివి పట్టగలడు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications