MI vs RCB: సూర్యకుమార్ గొప్ప క్రికెటర్ అవుతాడు.. 2011లోనే రోహిత్ శర్మ జోస్యం!!

హైదరాబాద్: సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం దేశం మొత్తంగా వినిపిస్తోన్న పేరు. సూర్యకుమార్‌కు టీమిండియాలో చోటు కల్పించకపోవడం పట్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. అదే సమయంలో అతని మీద సానుభూతి సునామీని కురిపిస్తున్నారు. దీంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో అద్భుతంగా రాణిస్తుండటం ఒక ఎత్తయితే.. సూర్యకుమార్‌ను భారత క్రికెట్ జట్టులోకి తీసుకోకపోవడం మరో ఎత్తుగా మారింది. మరోవైపు అతడికి మద్దతుగా వీరేందర్ సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఆకాశ్ చోప్రా సహా పలువురు మాజీలు స్పందించారు.
కోహ్లీ స్లెడ్జింగ్ చేసినా
విమర్శలు, పొగడ్తలు ఏమీ పట్టించుకోని సూర్యకుమార్ యాదవ్ తన ఆట ఆడాడు. గత రాత్రి ఐపీఎల్ టోర్నీలో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ప్లేయర్ సూర్యకుమార్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీపై 43 బంతుల్లో 79 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన సూర్యకుమార్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ చేసే ప్రయత్నం చేసినా.. సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆట, గుణం, పరిపక్వతతోనూ అభిమానులను ఆకట్టుకున్నాడు. దీంతో విరాట్ తీరుపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు.

రోహిత్ శర్మ జోస్యం
ఐపీఎల్‌లో గత మూడు సీజన్ల నుంచి నిలకడగా రాణిస్తోన్న సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్లో 40కిపైగా సగటుతో 155కిపైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. అందరూ సూర్యకుమార్ టాలెంట్‌ను పొగుడుతున్నారు. కానీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం 2011లోనే సూర్య బెస్ట్ ప్లేయర్ అని, గొప్ప క్రికెటర్ అవుతాడు అని గుర్తించాడు. భారత క్రికెట్‌లో సూర్యకుమార్ మంచి ఆటగాడిగా ఎదుగుతాడని జోస్యం చెప్పాడు. అదే ఇప్పుడు నిజమైంది. 2011 డిసెంబర్ నెలలో రోహిత్ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. 'ఇప్పుడే చెన్నైలో బీసీసీఐ అవార్డుల కార్యక్రమం ముగిసింది. కొందరు అద్భుత క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. ముంబై ఆటగాడు సూర్యకుమార్ భవిష్యత్తులో గొప్ప క్రికెటర్ అవుతాడు' అని ట్వీట్ చేశాడు.

క్రికెట్ దేవుడిలా భావించేవాడు
మరోవైపు సూర్యకుమార్ యాదవ్.. విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తేస్తూ ఇదివరకు చేసిన ట్వీట్లను అభిమానులు వెలికి తీస్తున్నారు. విరాట్ మీద యాదవ్‌కు ఉన్న అభిమానం ఎలాంటిదో మరోసారి గుర్తుకు తీసుకొస్తున్నారు. విరాట్‌ను సూర్యకుమార్ క్రికెట్ దేవుడిలా భావించే వాడని, అలాంటి ప్లేయర్.. స్లెడ్జింగ్‌కు పాల్పడటాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయంలో కోహ్లీని కూడా కాదని యాదవ్‌కు అండగా నిల్చుంటున్నారు. విరాట్ కోహ్లీ గాడ్ ఆఫ్ క్రికెట్‌గా అభిమానించే వాడంటూ పాత ట్వీట్లను వెలుగులోకి తీసుకొస్తున్నారు.

రెండేళ్లుగా స్థిరమైన ప్రదర్శన
వాస్తవానికి గత రెండేళ్లుగా సూర్యకుమార్ యాదవ్ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒక అనామక ప్లేయర్‌గా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన సూర్యకుమార్ ముంబై ఇండియన్స్‌కు వచ్చిన తర్వాత బాగా రాటుదేలాడు. 2018 నుంచి ముంబై తరపున ఐపీఎల్‌లో ఆడుతున్న అతను మంచి ప్రదర్శన కనబరిచాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన కోసం టీ20 సిరీస్‌కు సూర్యను తీసుకుంటారని అంతా భావించారు. కానీ సూర్యను కనీసం పరిగణలోకి తీసుకోలేదు.
MI vs RCB: భారత జట్టులో దక్కని చోటు.. సూర్యకుమార్‌కు రవిశాస్త్రి సందేశం!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications