Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs KKR: కోల్‌కతాదే బ్యాటింగ్.. ఇరు జట్లలో మార్పులు!

Kolkata Knight Riders Wins The Toss And Elects To Bat First

అబుదాబి: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితులు, పైగా తాము తొలి బ్యాటింగ్ చేస్తేనే ఎక్కువ గెలుస్తున్నామని, ఆ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని కేకేఆర్ నూతన సారథి ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. ఇక దినేశ్ కార్తీక్ తానంతట తానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని, బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు మేనేజ్‌మెంట్‌కు తెలపడంతో తనను సారథిగా నియమించారని ఈ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

ఇక జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయన్నాడు. టామ్ బాంటన్, నాగర్ కోటీ స్థానాల్లో శివమ్ మావి, క్రిస్ గ్రీన్ తుదిజట్టులోకి వచ్చారన్నాడు. ముంబై ఇండియన్స్‌లో కూడా ఒక మార్పు చోటుచేసుకుంది. జేమ్స్ పాటిన్సన్ స్థానంలో కౌల్టర్ నీల్ వచ్చాడని ఆ టీమ్ సారథి రోహిత్ శర్మ తెలిపాడు.

వరుసగా నాలుగు విజయాలు సాధించి డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ముంబై ఇండియన్స్ మంచి ఊపుమీదుంది. మరోపక్క బెంగళూరు చేతిలో 82 రన్స్‌‌ తేడాతో చిత్తుగా ఓడిన కోల్‌‌కతా కాస్త ఒత్తిడిలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో కేకేఆర్ 49 రన్స్‌‌ తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రోహిత్ సేనపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్లే ఆప్ బెర్త్ కు మార్గం సుగుమం చేసుకోవాలనే పట్టుదలతో కేకేఆర్ ఉంది.

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడగా 20-6తో ముంబై ఇండియన్స్ లీడ్‌లో ఉంది. గత సీజన్‌లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవగా.. గత నాలుగు మ్యాచ్‌లో మాత్రం ముంబైనే మూడింటిలో గెలుపొందింది. అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది.

తుది జట్లు..

ముంబై: రోహిత్‌శర్మ(కెప్టెన్‌), క్వింటన్ డికాక్‌(కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్ కిషన్, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, కౌల్టర్ నీల్, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా, రాహుల్‌ చాహర్‌

కోల్‌కతా: దినేశ్‌ కార్తీక్‌( కీపర్‌), శుభ్‌మన్‌గిల్‌, నితీశ్‌ రాణా, ఇయాన్ మోర్గాన్‌ (కెప్టెన్), ఆండ్రీ రసెల్‌, కమిన్స్‌, క్రిస్ గ్రీన్, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్‌ కృష్ణ, శివం మావి.

Story first published: Friday, October 16, 2020, 19:22 [IST]
Other articles published on Oct 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+