Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs KKR: కమిన్స్ సూపర్ ఫిఫ్టీ.. ముంబై ముందు సాధారణ లక్ష్యం

 IPL 2020, MI vs KKR: Eoin Morgan, Pat Cummins propel KKR to 148 for 5

అబుదాబి: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 149 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కేకేఆర్ టాపార్డర్ చేతులెత్తేయగా.. ప్యాట్ కమిన్స్(36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్), ఇయాన్ మోర్గాన్(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) అద్భుత భాగస్వామ్యంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, నాథన్ కౌల్టర్ నీల్, బుమ్రా తలో వికెట్ తీయగా.. రాహుల్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (9 బంతుల్లో 7) బౌల్ట్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా(5) కూడా నిరాశపరిచాడు. దాంతో పవర్ ప్లే ముగిసే‌సరికి కేకేఆర్ 2 వికెట్లకు 33 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్(21), దినేశ్ కార్తీక్(4)లను రాహుల్ చాహర్ వరుస బంతుల్లో ఔట్ చేసి కోల్‌కతాను కోలుకోలేని దెబ్బతీశాడు.

శుభ్‌మన్ పొలార్డ్‌కు క్యాచ్ ఇవ్వగా.. స్వీప్ షాట్ ఆడబోయిన మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్ కట్ అండ్ బౌల్ట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్ భారీ సిక్సర్‌తో ఆశలు రేకిత్తించినా ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బుమ్రా బౌలింగ్‌లో రస్సెల్(12) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కోల్‌కతా కష్టాలో పడింది. ఈ క్లిష్ట పరిస్థితిలో మోర్గాన్, ప్యాట్ కమిన్స్ నిదానంగా ఆడుతూ 57 బంతుల్లో 87 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

కమిన్స్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో ఐపీఎల్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీ చేయగా.. మోర్గాన్ యాంకర్ రోల్ పోషించాడు. చివరి రెండు ఓవర్లోనే కేకేఆర్ 35 రన్స్ చేయడంతో కేకేఆర్ ఈ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.

Story first published: Friday, October 16, 2020, 22:45 [IST]
Other articles published on Oct 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+