పాంటింగ్.. ధావన్‌ను చితకొట్టు
ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పట్ల ఆ జట్టు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధావన్ వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శనే చేసినప్పటికీ ( 69 నాటౌట్) ధాటిగా ఆడలేకపోయాడు. ఇక ఇన్నింగ్స్ చివరలో హార్డ్ హిట్టర్ మార్కస్ స్టోయినిస్‌ను రనౌట్ చేశాడు. ఈ విషయంలో గబ్బర్ తప్పు చేశాడంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. 'కోచ్ రికీ పాంటింగ్.. నీ స్ప్రింగ్ బ్యాట్‌తో ధావన్‌ను చితకొట్టు' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'స్టోయినిస్ బదులు ధావన్ ఔటైనా బాగుండు' అని మరో అభిమాని ట్వీటాడు.
డ్రెస్సింగ్ రూంలో తన్నులు పడతాయి
'ఐపీఎల్ 2020 ఆరంభం నుంచి మెరుగ్గా రాణిస్తున్న మార్కస్ స్టోయినిస్ క్రీజులో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అతడు కనీసం మరో 20 పరుగులైనా చేసేవాడు', 'తొలి మ్యాచ్ నుంచి నిరాశపరుస్తున్న ధావన్.. ఇప్పుడు కూడా వన్డే తరహా బ్యాటింగ్‌తో చిరాకు తెప్పించాడు. జట్టుకు భారంగా మారాడు', 'ధావన్‌కు ఈ రోజు డ్రెస్సింగ్ రూంలో తన్నులు పడతాయి. మొదటగా పాంటింగ్ ఫెవరేట్ ఆటగాడు రనౌట్ అయినందుకు.. రెండోది మంచి ఇన్నింగ్స్ ఆడనందుకు', 'స్టోయినిస్ రనౌట్.. జట్టుపై ప్రభావం చూపింది' అని ఢిల్లీ ఫాన్స్ ధావన్‌పై మండిపడుతున్నారు.
స్టోయినిస్ రనౌట్
శిఖర్ ధావన్‌తో సమన్వయ లోపం కారణంగా ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ రనౌటైపోయాడు. స్పిన్నర్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో బంతిని మిడాన్ దిశగా హిట్ చేసిన స్టోయినిస్ సింగిల్ పూర్తి చేసి.. రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఫీల్డర్ సూర్యకుమార్ చేతుల్లో నుంచి బంతి బౌన్స్ అయ్యింది. దాంతో రెండో పరుగు కోసం కీపర్ ఎండ్‌వైపు స్టోయినిస్ పరుగెత్తాడు. తొలుత రెస్పాండ్ అయిన ధావన్.. అనూహ్యంగా వెనక్కి తగ్గాడు. అప్పటికే పిచ్ సగంలోకి వెళ్లిపోయిన స్టోయినిస్.. రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.
రహానేపై కూడా
ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ కూడా దారుణంగా చేసింది. అజింక్య రహానే కీలక రనౌట్ మిస్ చేశాడు. పృథ్వీ షా మరియు ఆర్ అశ్విన్ క్యాచులను జారవిడిచారు. దీనికి తోడు ఎన్నోసార్లు మిస్ ఫీల్డింగ్ చేశారు. మిస్ ఫీల్డింగ్ కారణంగా 15-20 పరుగులు అదనంగా ఇచ్చుకున్నారు. చిన్న స్కోరును కాపాడుకోవాలంటే.. ఫీల్డింగ్ చాలా ముఖ్యం. కానీ ఢీల్లీ మాత్రం అదే తప్పు చేసి మూల్యం చెల్లించుకుంది. రహానేపై కూడా ఢిల్లీ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఎంఎస్ ధోనీని విమర్శించే వాళ్లని చూస్తే జాలేస్తోంది: టీమిండియా మాజీ క్రికెటర్


Click it and Unblock the Notifications












