MI vs DC: ఢిల్లీ కొంపముంచిన ఆ మూడు తప్పిదాలు ఇవే!!

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో ఆదివారం రాత్రి డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్, బ్యాటింగ్ సహా ఫీల్డింగ్‌లోనూ అద్భుత విన్యాసాలు చేసిన ముంబై అదరహో అనిపించింది. క్వింటన్ డికాక్ (53: 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (53: 32 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధ శతకాలతో రాణించడంతో 163 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండానే ఛేదించింది. ఇక మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

వేగంగా పెంచని ధావన్:
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహాత్మకంగా చేసిన తప్పిదాలతోనే భారీ మూల్యం చెల్లించుకుంది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (69 నాటౌట్; 52 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ ) అర్ధశ తకంతో రాణించినా.. వేగంగా మాత్రం ఆడలేకపోయాడు. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉన్న గబ్బర్.. 52 బంతుల్లో 69 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీ బౌలర్లపై అతడు ఎక్కడ కూడా ఆధిపత్యం చెలాయించలేదు. బౌండరీలు కూడా ఎక్కువగా బాధలేదు. దీంతో చివరి ఐదు ఓవర్లలో ఢిల్లీ కేవలం 51 పరుగులు మాత్రమే చేయగలిగింది. గబ్బర్ ధాటిగా ఆడుంటే ఢిల్లీ మరో 20-30 అదనంగా చేసుండేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేదేమో?.

రబాడాతో ఒక్క ఓవరే:
ముంబై లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో ఢిల్లీ పెద్ద తప్పిదమే చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలో స్ట్రైక్ బౌలర్, ఐపీఎల్ 2020లో అత్యధిక వికెట్ల ధీరుడు కగిసో రబాడాతో కేవలం ఒకే ఒక్క ఓవర్ వేయించాడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. ఇక ఐదో ఓవర్లో రోహిత్ శర్మ ఔట్ అయినప్పుడు కూడా రబాడాతో మరో ఓవర్ వేయించలేదు ఢిల్లీ కెప్టెన్. అన్రిచ్ నోర్జ్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్‌లతో పవర్ ప్లే పూర్తిచేశాడు. ఆరంభంలోనే రబాడాతో వేయించి ఉంటే.. ముంబైపై ఒత్తిడి పెరిగేది. మరో వికెట్ కూడా పడేదేమో. 11వ ఓవర్లో రబాడా మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికే ఢిల్లీ 80 పరుగులు చేసింది.

ఫీల్డింగ్ తప్పిదాలు:
ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఈ మ్యాచులో దారుణంగా ఉంది. అజింక్య రహానే కీలక రనౌట్ మిస్ చేశాడు. పృథ్వీ షా మరియు ఆర్ అశ్విన్ క్యాచులను జారవిడిచారు. దీనికి తోడు ఎన్నో మిస్ ఫీల్డింగ్ చేశారు. మిస్ ఫీల్డింగ్ కారణంగా 15-20 పరుగులు అదనంగా ఇచ్చుకున్నారు. చిన్న స్కోరును కాపాడుకోవాలంటే.. ఫీల్డింగ్ చాలా ముఖ్యం. కానీ ఢీల్లీ మాత్రం అదే తప్పు చేసి మూల్యం చెల్లించుకుంది. వచ్చే మ్యాచులో అయినా ఈ తప్పిదాలు సరిదిద్దుకుంటే ఢిల్లీ విజయం సాధించే అవకాశం ఉంది.

స్టోయినిస్ రనౌట్:
శిఖర్ ధావన్‌తో సమన్వయ లోపం కారణంగా ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ రనౌటైపోయాడు. స్పిన్నర్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో బంతిని మిడాన్ దిశగా హిట్ చేసిన స్టోయినిస్ సింగిల్ పూర్తి చేసి.. రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఫీల్డర్ సూర్యకుమార్ చేతుల్లో నుంచి బంతి బౌన్స్ అయ్యింది. దాంతో రెండో పరుగు కోసం కీపర్ ఎండ్‌వైపు స్టోయినిస్ పరుగెత్తాడు. తొలుత రెస్పాండ్ అయిన ధావన్.. అనూహ్యంగా వెనక్కి తగ్గాడు. అప్పటికే పిచ్ సగంలోకి వెళ్లిపోయిన స్టోయినిస్.. రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇది కూడా ఢిల్లీ ఓటమికి ఓ కారణం.
'నేను యూనివర్సల్ బాస్‌ను.. నా గురించి తెలుసుగా?.. పోరాడకుండా వెనుదిరగను'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications