For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నేను యూనివర్సల్ బాస్‌ను.. నా గురించి తెలుసుగా?.. పోరాడకుండా వెనుదిరగను'

IPL 2020: Don’t forget my style Says Chris Gayle

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. వరుస ఓటములు ఎదురవుతున్నా గేల్‌ మాత్రం బరిలోకి దిగడం లేదు. నిజానికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనే గేల్ ఆడతాడని పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే ప్రకటించాడు. కానీ ఫుడ్ పాయిజనింగ్ కావడంతో చివరి నిమిషంలో అతణ్ని తీసుకోలేకపోయామని తెలిపాడు. ఇక శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుతో జరిగిన మ్యాచులో కూడా యూనివర్సల్ బాస్ ఆడలేదు. అతని ఆరోగ్యం బాగాలేదని సమాచారం.

నేను యూనివర్సల్ బాస్‌ను:

నేను యూనివర్సల్ బాస్‌ను:

తాజాగా క్రిస్ గేల్ తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను విడుదల చేశాడు. చేతిలో గ్లాస్, కళ్లపై కీరదోశ, నోట్లో క్యారెట్ ముక్క పెట్టుకుని ఆసుపత్రి బెడ్‌పై సేదదీరుతూ ఫోన్‌లో మాట్లాడుతున్నట్టున్న ఫొటోలో ఉంది. ఆ ఫొటోకు గేల్ మంచి క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. 'ఓ విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. నేనెప్పుడూ పోరాడకుండా వెనుదిరగను. ఎందుకంటే.. నేను యూనివర్సల్ బాస్‌ను. అది ఎప్పటికీ మారదు!!. ‌నా నుంచి అన్నిసార్లూ కాకున్నా కొన్నిసార్లు నేర్చుకోచ్చు. నా శైలిని, పోరాట పటిమను మరచిపోకండి. నేను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని గేల్ తెలిపాడు.

 ఏడు మ్యాచ్‌లు.. ఒక్క విజయం:

ఏడు మ్యాచ్‌లు.. ఒక్క విజయం:

ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు దారుణంగా విఫలమవుతూ వస్తోంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ ఛేదనలో పంజాబ్‌ గెలుపు అంచుల వరకూ వచ్చి పరాజయం పాలైంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ అన్ని మ్యాచుల్లోనూ విధ్వంసకర ఆటగాడు క్రిస్ ‌గేల్‌ను పక్కనపెట్టింది. పంజాబ్ ఓటములకు అదే కారణమని, విఫలమవుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను పక్కనపెట్టి ఆ స్థానంలో గేల్‌ను ఆడించాలన్న ఒత్తిడి ఎక్కువవుతోంది.

మండిపడుతున్న ఫాన్స్:

మండిపడుతున్న ఫాన్స్:

వరుస ఓటముల ఎదురవుతున్నా.. క్రిస్ గేల్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ బరిలో దింపకపోవడంపై ఫాన్స్ మండిపడుతున్నారు. ఎందుకు గేల్‌ను తీసుకోలేదంటూ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ వరుస మ్యాచ్‌ల్లో విఫలమైనా.. అతణ్నే తుది జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. గేల్‌ పంజాబ్ తలరాతను మార్చగలడు.. ఎందుకు ఆడించట్లేదు అని ఓ అభిమాని మండిపడ్డాడు. 'పంజాబ్ పాయింట్ల పట్టికలో చివరలో ఉంది. అయినా గేల్‌ లాంటి మంచి ఆటగాడిని ఎందుకు అండించట్లేదు. గేల్‌ పంజాబ్ తలరాతను మార్చగలడు' అని మరో అభిమాని ట్వీట్ చేశాడు.

ప్లేఆఫ్స్‌కు చేరాలంటే:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం ఒక్క విజయంతోనే కొనసాగుతోంది. దీంతో 2 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగతా అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. అది కూడా మెరుగైన రన్‌రేట్‌తో విజయాలు సాధించాలి. ఒక్క మ్యాచ్ ఓడినా పంజాబ్ ఇంటికి పయనమవ్వాల్సిందే. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే.. పంజాబ్ పుంజుకోవడం కాస్త కష్టమే.

'గెలిచే మ్యాచ్‌ ఎలా ఓడిపోవాలో పంజాబ్‌ చూపించింది.. రాహుల్‌ టీమ్‌ ఆడిన తీరు ఊహకు కూడా అందలేదు'

Story first published: Monday, October 12, 2020, 8:23 [IST]
Other articles published on Oct 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+