Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KXIP vs SRH: పంజాబ్‌దే బ్యాటింగ్.. మయాంక్ దూరం.. హైదరాబాద్‌లో మార్పు!

 Sunrisers Hyderabad has won the toss and elected to field

దుబాయ్‌: కింగ్స్ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చేజింగ్‌ సులువని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఇక ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామని, నదీమ్ స్థానంలో ఖలీల్ జట్టులోకి వచ్చాడన్నాడు. మరోవైపు కింగ్స్ పంజాబ్‌‌లో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. కీలక ఆటగాడైన మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో మన్‌దీప్ సింగ్ రాగా.. జిమ్మీ నిషమ్ ప్లేస్‌లో క్రిస్ జోర్డాన్ తుది జట్టులోకి వచ్చాడు.

ఇరు జట్లకు ఇది చావోరేవో మ్యాచ్. గెలిచే జట్టే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తోంది. దాంతో ఇరు జట్లు తమ సాయశక్తుల పోరాడనున్నాయి. ఇక ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే జోరును కొనసాగించాలని హైదరాబాద్ భావిస్తుండగా.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పంజాబ్ పట్టుదలతో ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య ఓవరాల్‌గా 15 మ్యాచ్‌లు జరగ్గా 11-4తో హైదరాబాద్‌పై చేయిసాధించింది.

కింగ్స్ పంజాబ్: కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, అశ్విన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే, విజయ్ శంకర్, ప్రియామ్ గార్గ్, అబ్దుల్ సమాద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, నటరాజన్

Story first published: Saturday, October 24, 2020, 19:50 [IST]
Other articles published on Oct 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+