KXIP vs SRH: హైదరాబాద్ ఖేల్ ఖతమ్.. పంజాబ్ అద్భుత విజయం!

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన చావో రేవో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 12 పరుగులతో హైదరాబాద్‌పై అద్భుత విజయాన్నందుకుంది. సులువుగా గెలిచే మ్యాచ్‌ను హైదరాబాద్ అనవసర ఒత్తిడికి లోనై చేజార్చకుంది. ఈ ఓటమితో ప్లే ఆఫ్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది. మరోవైపు ఓటమి అంచు నుంచి స్పూర్తిదాయక ఆటతో ఆకట్టుకున్న పంజాబ్ అద్భుత విజయాన్నందుకొని ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 రన్స్ చేసింది. నికోలస్ పూరన్ (32 నాటౌట్) కేఎల్ రాహుల్(27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ(2/29), జాసన్ హోల్డర్(2/27), రషీద్ ఖాన్(2/14) రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. 18వ ఓవర్ వరకు గెలుపు దిశగా దూసుకెళ్లిన హైదరాబాద్.. ఒక్కసారిగా తడబడింది. చివరి రెండు ఓవర్లలోనే ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. డేవిడ్ వార్నర్(35), బెయిర్ స్టో(19) అందించిన శుభారంభానికి విలువ లేకుండా పోయింది.

సూపర్ స్టార్ట్..
ఇక 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్(35), బెయిర్‌స్టో(19) మంచి శుభారంభాన్ని అందించారు. ఓవైపు బెయిర్‌స్టో నిదానంగా ఆడినా.. మరోవైపు వార్నర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. దాంతో హైదరాబాద్ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 52 రన్స్ చేసింది. ఆ వెంటనే పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు. అతని బౌలింగ్‌లో వార్నర్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

మనీష్ పాండే-విజయ్ శంకర్..
ఆ వెంటనే మురుగన్ అశ్విన్ బెయిర్ స్టోను బౌల్డ్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన యువ హిట్టర్ అబ్దుల్ సమద్(7) తీవ్రంగా నిరాశపరిచాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో హైదరాబాద్ 67 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో మనీష్ పాండే, విజయ్ శంకర్ ఆచితూచి ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేశారు.

స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్ టర్నింగ్..
అయితే క్రిస్ జోర్డాన్ వేసిన 17వ ఓవర్ ఫస్ట్ బాల్‌ను మనీష్ పాండే స్ట్రైట్‌గా భారీ షాట్ ఆడగా.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సుజీత్ సూపర్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. దాదాపు సిక్స్ వెళ్లిన బంతిని సుజీత్ అద్భుతంగా ఎగిరి అందుకున్నాడు. దాంతో పాండే(15) నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఈ ఓవర్‌లో విజయ్ శంకర్ ఫోర్ కొట్టడంతో విజయ సమీకరణం 18 బంతుల్లో 20గా మారింది. కానీ విజయ్ శంకర్ (26) కూడా కీపర్ క్యాచ్‌గా ఔటవ్వడంతో మ్యాచ్‌లో ఉత్కంఠత రేకెత్తింది.

చివరి 2 ఓవర్లలో 5 వికెట్లు..
చివరి 12 బంతుల్లో హైదరాబాద్ విజయానికి 17 రన్స్ అవసరమయ్యాయి. జాసన్ హోల్డర్(5), రషీద్ ఖాన్(0) వరుస బంతుల్లో ఔటవ్వడంతో మ్యాచ్‌పై పంజాబ్ మరింత పట్టుబిగించింది. చివరి ఓవర్‌లో హైదరాబాద్ విజయానికి 14 రన్స్ అవసరం కాగా.. 2 రన్స్ చేసి మూడు వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications