KXIP vs RR: ప్చ్.. పంజాబ్ ఓడింది.. రాజస్థాన్ ప్లే ఆఫ్ రేసులో నిలిచింది!

అబుదాబి: ఐపీఎల్ 2020లో రాజస్థాన్ రాయల్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. సూపర్ బ్యాటింగ్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. 186 పరుగుల భారీ లక్ష్యాన్ని సూపర్ పెర్ఫెమెన్స్‌తో అలవోకగా చేధించి 7 వికెట్లతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. క్రిస్ గేల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సలతో 99), కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) రాణించారు.

బెన్ స్టోక్స్ ధాటైన ఇన్నింగ్స్
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి సునాయసంగా గెలుపొందింది. బెన్ స్టోక్స్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), సంజూ శాంసన్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) ధాటైన ఇన్నింగ్స్‌తో రాణించగా.. చివర్లో స్టీవ్ స్మిత్(20 బంతుల్లో 5 ఫోర్లు 31 నాటౌట్), జోస్ బట్లర్ (11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 22 నాటౌట్) చెలరేగారు. పంజాబ్ బౌలర్లలో అశ్విన్, జోర్డాన్‌లకు చెరొక వికెట్ దక్కింది. ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకోగా.. రాజస్థాన్ తమ అవకాశాలను మెరుగుపర్చుకుంది.

రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు శుభారంభం
86 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు బెన్ స్టోక్స్, రాబిన్ ఉతప్ప(30) మంచి శుభారంభాన్ని అందించారు. మురుగన్ అశ్విన్ వేసిన నాలుగో ఓవర్‌లో స్టోక్స్ 4, 6, 6తో విరుచుకుపడి 16 రన్స్ పిండుకున్నాడు. అనంతరం క్రిస్ జోర్డాన్ వేసిన 6వ ఓవర్‌లో స్టోక్స్ సిక్స్ కొట్టి 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ బంతి వ్యవధిలోనే భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

శాంసన్ ధాటిగానే
అనంతరం క్రీజులోకి వచ్చిన శాంసన్.. ధాటిగానే ఆడాడు. ఓవర్‌కో బౌండరీ రాబట్టిన ఈ జోడీ.. రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్తపడింది. అయితే అశ్విన్ వేసిన 11వ ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టిన ఊతప్ప.. అదే జోరులో మరో సిక్సర్ కొట్టబోయి బౌండరీ లైన్ వద్ద పూరన్ చేతికి చిక్కాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 41 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం స్మిత్‌తో శాంసన్ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వరుస బౌండరీలతో దూకుడు కనబర్చిన శాంసన్.. అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. దాంతో తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో బట్లర్, స్మిత్ ధాటిగా ఆడటంతో రాజస్థాన్ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications