For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KXIP vs RR: ‌పంజాబ్‌దే బ్యాటింగ్.. మయాంక్ మళ్లీ దూరం.. రాజస్థాన్‌లో ఒక మార్పు!

Kings XI Punjab vs Rajasthan Royals
IPL 2020,KXIP vs KKR : Kings XI Punjab Defeated Kolkata Knight Riders By 8 Wickets || Oneindia

అబుదాబి: కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. అంకిత్ రాజ్‌పుత్ స్థానంలో వరుణ్ ఆరోన్ తుది జట్టులోకి వచ్చాడన్నాడు. ఇక తాము కూడా ఫీల్డింగ్ తీసుకునేవాళ్లమని కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నామన్నాడు. దాంతో మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌కు కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ప్లే ఆఫ్‌‌‌‌ రేస్‌‌‌‌ నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌ ఫలితం‌‌‌ ఇరు జట్లకు కీలకం. మరీ ముఖ్యంగా రాజస్తాన్‌ రాయల్స్‌‌‌కు ఈ విజయం అత్యవసరం. ఓడిపోతే ప్లే ఆఫ్‌‌‌‌ పోటీ నుంచి ఔటవుతుంది. మరోపక్క రాయల్స్‌‌‌‌ను చిత్తు చేసి ప్లే ఆఫ్‌‌‌‌ బెర్త్‌‌‌‌కు మరింత దగ్గరవ్వాలని పంజాబ్‌‌‌‌ భావిస్తోంది. అయితే ఈ సీజన్ ఫస్టాఫ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ అద్భుత విజయాన్నందుకుంది.

పంజాబ్ విధించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాహుల్ తెవాటియా సెన్సెషనల్ బ్యాటింగ్‌తో రాజస్థాన్ చేధించింది. ఆ మ్యాచ్‌లో ఆఖరి వరకు పోరాడిన పంజాబ్ విజయం ముంగిట చేతులెత్తేసింది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలతో పాటు గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో పంజాబ్ బరిలోకి దిగుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 20 సార్లు తలపడగా 11-9తో రాజస్థాన్ లీడ్‌లో ఉంది. గత సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో పంజాబే విజయం సాధించింది.

తుది జట్లు

పంజాబ్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్రిస్ గేల్, మన్‌దీప్ సింగ్, మాక్స్‌వెల్‌, నికోలస్ పూరన్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్‌ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

రాజస్థాన్‌: బెన్ స్టోక్స్, రాబిన్ ఊతప్ప, సంజూ శాంసన్‌, స్టీవ్‌ స్మిత్ (కెప్టెన్‌), జోస్ బట్లర్, రియాన్‌ పరాగ్‌, రాహుల్ తెవాటియా, శ్రేయస్‌ గోపాల్‌, జోఫ్రా ఆర్చర్, వరుణ్ ఆరోన్, కార్తీక్ త్యాగి

Story first published: Friday, October 30, 2020, 19:11 [IST]
Other articles published on Oct 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+