
పటిష్టంగా పంజాబ్..
ఫామ్ ప్రకారం కింగ్స్ పంజాబే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్. జట్టు మొత్తం అన్ని విభాగాల్లో బలంగా ఉంది. కెప్టెన్ రాహుల్ వారి ప్రధాన బలం కాగా.. క్రిస్ గేల్ రాకతో బ్యాటింగ్‌లో మరింత సమతూకం వచ్చింది. మన్‌దీప్ సింగ్ కూడా రాణించడం కలిసొచ్చే అంశం. అయితే ఈ మ్యాచ్‌తో మయాంక్ అగర్వాల్ రీఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి. నికోలస్ పూరన్; మ్యాక్స్‌వెల్, దీపక్ హుడాతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. అయితే గత మూడు మ్యాచ్‌ల్లో రాహుల్ 15, 27, 28 పరుగులే చేయడం కొంత కలవరపెడుతుంది. అలాగే మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ వైఫల్యం కూడా కొనసాగుతుంది. ఈ ఇద్దరు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మహ్మద్ షమీ ఆధ్వర్యంలోనే బౌలింగ్‌లో లైనప్‌లోనూ పెద్దగా సమస్యల్లేవు. అతనికి తోడుగా అర్ష్‌దీప్ సింగ్, రవిబిష్ణోయ్ రాణిస్తున్నారు. మయాంక్ జట్టులోకి వస్తే దీపక్ హుడా, మన్‌దీప్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావచ్చు.

రెట్టించిన ఉత్సాహంతో రాజస్థాన్
మరోపక్క రాజస్తాన్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. బెన్ స్టోక్స్ సూపర్ సెంచరీ చేయడంతో ముంబైపై గత మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. స్టోక్స్ గత పెర్ఫామెన్స్‌ను రిపీట్ చేయాలని కోరుకుంటుంది. సంజు శాంసన్ కీలకం కానుండగా.. స్మిత్, బట్లర్ రాణించడంపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆర్చర్ నాయకత్వంలోని బౌలర్లు ఇటీవల తేలిపోతుండడం రాయల్స్‌ను కాస్త కలవరపెడుతుంది. అంకిత్ రాజ్‌పుత్ వద్దనుకుంటే వరుణ్ అరుణ్ లేక జయదేవ్ ఉనాద్కత్ జట్టులోకి రావచ్చు.

తుది జట్లు (అంచనా)
పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, మాక్స్‌వెల్, నికోలస్ పూరన్, మన్‌దీప్ సింగ్/దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
రాజస్థాన్: బెన్ స్టోక్స్, రాబిన్ ఊతప్ప, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్,అంకితి రాజ్‌పుత్/వరుణ్ ఆరోన్/ జయదేవ్ ఉనద్కత్, కార్తీక్ త్యాగి

పిచ్ రిపోర్ట్
దుబాయ్ పిచ్ చేజింగ్‌కు అనుకూలిస్తుంది. ఇక్కడ జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో అదే జరిగింది. దాంతో టాస్ గెలిచే జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ముఖా ముఖి:
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 20 సార్లు తలపడగా 11-9తో రాజస్థాన్ లీడ్‌లో ఉంది. గత సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో పంజాబే విజయం సాధించింది.


Click it and Unblock the Notifications












