For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KXIP vs RR: క్రిస్ గేల్ విధ్వంసం.. తృటిలో చేజారిన శతకం.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం!

Chris Gayles 99 takes Kings XI Punjab to 185-4

అబుదాబి: క్రిస్ గేల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సలతో 99) పరుగుల విధ్వంసానికి కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) క్లాసిక్ ఇన్నింగ్స్‌ తోడవడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. రాజస్థాన్ రాయల్స్ ముందు 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రెండో వికెట్‌కు ఈ జోడీ 120 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (10 బంతుల్లో 3 సిక్స్‌లతో 22) కూడా ధాటిగా ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, స్టోక్స్ రెండేసి వికెట్లు తీశారు.

ఆదిలోనే షాక్..

ఆదిలోనే షాక్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన ఓపెనర్ మన్‌దీప్ సింగ్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్‌ను మన్‌దీప్ పాయింట్ దిశగా ఆడగా.. స్టోక్స్ సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. దాంతో పంజాబ్ పరుగుకే వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో ధాటిగా ఆడాడు. కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నా.. తర్వాత తన మార్క్ షాట్లతో అలరించాడు. కార్తీక్ త్యాగీ వేసిన ఐదో ఓవర్‌లో గేల్.. 4, 6, 4 కొట్టగా.. వరుణ్ ఆరోన్ బౌలింగ్‌లో రాహుల్ 6, 4 కొట్టాడు. దాంతో పంజాబ్ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది.

 గేల్ సూపర్ ఫిఫ్టీ

గేల్ సూపర్ ఫిఫ్టీ

అనంతరం ఓవర్‌కో సిక్స్ కొట్టిన ఈ జోడీ.. స్కోర్ బోర్డును వేగంగా పరుగెత్తించింది. తెవాటియా వేసిన 11వ ఓవర్‌లో లాంగాన్‌లో భారీ సిక్సర్ కొట్టిన గేల్ 30 బంతుల్లోనే ఈ సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే బంతి వ్యవధిలోనే గేల్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను తెవాటియా చేజార్చాడు. క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీని తెవాటియా విడదీశాడు. కేఎల్ రాహుల్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో ఫస్ట్ వికెట్‌కు నమోదైన 120 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఇక క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ వచ్చిరావడంతో భారీ సిక్సర్ కొట్టాడు. ధాటిగా ఆడుతున్న ఈ జోడీకి స్టోక్స్ బ్రేక్ వేశాడు. అతని వేసిన 18వ ఓవర్ ఆఖరి బంతిని నికోలస్ పూరన్(10 బంతుల్లో 22) భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ మీద రాహుల్ తెవాటియా చాకచక్యంగా అందుకున్నాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 41 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

 గేల్ @1000 సిక్సర్లు..

గేల్ @1000 సిక్సర్లు..

అనంతరం మ్యాక్స్‌వెల్ క్రీజులోకి రాగా.. కార్తీక్ త్యాగీ వేసిన 19వ ఓవర్ ఐదో బంతిని భారీ సిక్సర్‌గా మలిచిన యూనివర్సల్ బాస్.. టీ20 క్రికెట్‌లో 1000 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా ఈ ఘనతను అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. చివరి ఓవర్‌లో ఆర్చర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మూడో బంతిని భారీ సిక్సర్ కొట్టిన గేల్.. 99 పరుగుల వద్ద ఆ మరుసటి బంతికే క్లీన్ బౌల్ట్ అయ్యాడు. దాంతో తీవ్ర నిరాశకు గురైన యూనివర్స్ బాస్ బ్యాట్‌ను నేలకు కొట్టాడు. అయితే ఆ వెంటనే బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను మెచ్చుకొని క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు రావడంతో పంజాబ్ 184 పరుగులకే పరిమితమైంది.

Story first published: Friday, October 30, 2020, 21:34 [IST]
Other articles published on Oct 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+