
42 శాతం షార్ట్‌బాల్స్
ఐపీఎల్ 2020 లీగ్‌లో భాగంగా ఈరోజు ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మలు తలపడనున్నారు. ఈ సీజన్‌లో నిప్పులు చెరిగే బంతులతో షమీ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. తాను తీసిన వికెట్లలో 42 శాతం షార్ట్‌బాల్స్ నుంచి వచ్చినవే. షమీ వేసిన మొత్తం బంతుల్లో 16శాతం బంతులు బౌన్సర్లే కావడం విశేషం. ఓవర్‌కు ఒకటి చొప్పున షార్ట్‌బాల్ వేసే అవకాశం బౌలర్లకు ఉన్నందున ఈ అవకాశాన్ని షమీ బాగా ఉపయోగించుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో ఇవే బౌన్సర్‌లను అస్త్రాలుగా చేసుకొని ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులకే మూడు కీలక వికెట్లు తీశాడు.

మూడు ఓవర్లు.. 14 పరుగులు
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ మహ్మద్ షమీ ప్రత్యర్థిని కోలుకోలేని విధంగా దెబ్బ తీశాడు. మూడు ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా షమీ అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లు వేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో 7 వికెట్లు తీసి.. పాయింట్ల పట్టికలో రబాడాతో సమానంగా షమీ ఉన్నాడు. అయితే ఎకానమీ పరంగా చూస్తే మాత్రం రబాడా మెరుగ్గా ఉన్నాడు.

రోహిత్ పుల్‌షాట్
స్టార్ ఓపెనర్, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పుల్‌షాట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో పుల్‌షాట్ ఆడే బ్యాట్స్‌మెన్లో ఒకడు. రోహిత్ 2015 నుంచి 570 బౌన్సర్లు ఎదుర్కోగా.. అందులో 116 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. 2015 నుంచి రోహిత్ చేసిన 5,400 పరుగుల్లో 1,567 పరుగులు పుల్‌షాట్ రూపంలో వచ్చినవే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. హిట్‌మ్యాన్‌కు పుల్‌షాట్ అంటే ఎంత ఇష్టమో. పుల్‌షాట్‌ను సమర్థంగా ఆడే బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ నంబర్‌వన్‌గా ఉండగా.. డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ బౌన్సర్లతో చుక్కలు చూపించేందకు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు ముంబై కెప్టెన్ రోహిత్ సైతం తన పుల్‌షాట్లకు పని చెప్పేందుకు సై అంటున్నాడు.

ముంబై ఫేవరెట్
ప్రస్తుత సీజన్‌లో సంచలన విజయాలు సాధిస్తున్న పంజాబ్ ఇతర జట్లకు సవాల్ విసురుతోంది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ పరుగుల వరద పారిస్తున్నారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో టాపార్డర్ విఫలం కాగా ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్ వీరోచితంగా పోరాడినా ఫలితం దక్కలేదు. ఇక పంజాబ్ బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు. డెత్ ఓవర్లలో షమీ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నిలకడలేమి ఆ జట్టును బాగా ఇబ్బందిపెడుతున్నది. మూడు మ్యాచ్‌ల్లో బుమ్రా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఫామ్ చూస్తే ముంబై ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ అని చెప్పొచ్చు.
IPL 2020: సన్‌రైజర్స్‌కు షాక్.. ప్లేఆఫ్ చేరే నాలుగు జట్లు ఇవే!!


Click it and Unblock the Notifications












