IPL 2020: సన్‌రైజర్స్‌కు షాక్.. ప్లేఆఫ్ చేరే నాలుగు జట్లు ఇవే!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో ఆడుతున్న 8 జట్లు.. బుధవారం వరకు మూడేసి మ్యాచ్‌లు ఆడాయి. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు మ్యాచ్‌లు గెలిసి పాయింట్ల పట్టికలో వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి వరుసగా చివరి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో.. అన్ని జట్లకు ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంది.

షేన్ వార్న్ జోస్యం:
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ మెంటార్ షేన్ వార్న్ ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్ చేరే నాలుగు జట్లు ఇవే అంటూ జోస్యం చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్ చేరుకుంటాయని వార్న్ అంచనా వేశాడు. రాజస్థాన్, చెన్నై జట్లు పటిష్టంగా ఉన్నాయని.. ముంబై, ఢిల్లీలు మంచి సమతూకంతో ఉన్నాయని వార్న్ పేర్కొన్నాడు. వార్న్ అంచనాల్లో మన తెలుగు రాష్ట్రాల అభిమాన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ లేదు.

శాంసన్‌పై ప్రశంసలు
రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసలు కురిపించాడు. మూడు మ్యాచ్‌ల్లోనే 16 సిక్సులు బాదిన శాంసన్ బ్యాటింగ్ అద్భుతం అని కొనియాడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో శాంసన్ నిలకడగా ఆడతాడని కోరుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో రాణిస్తే.. శాంసన్ భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ ఆడే అవకాశం ఉందని వార్న్ పేర్కొన్నాడు. వార్న్ ఆసీస్ తరపున 145 టెస్టులు, 194 టెస్టులు ఆడాడు.

స్టైరిస్ ప్లేఆఫ్ జట్లు ఇవే
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత స్కాట్ స్టైరిస్ కూడా ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్ చేరే జట్లు ఏవో జోస్యం చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉందన్నాడు. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయని చెప్పాడు. వార్న్, స్టైరిస్ అంచనాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. వార్న్ ప్లేఆఫ్ లిస్టులో రాజస్థాన్‌కు చోటు ఇవ్వగా.. స్టైరిస్ కోల్‌కతా వైపు మొగ్గు చూపాడు. సన్‌రైజర్స్ ఐదో స్థానంలో, బెంగళూరు ఆరో స్థానంలో, పంజాబ్ ఏడో స్థానంలో నిలిచే అవకాశం ఉందని స్టైరిస్ చెప్పాడు. రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలుస్తుందన్నాడు

అనూహ్య మార్పులు
ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. రాయల్స్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో గెలుపొందిన కోల్‌కతా.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి రెండుకి ఎగబాకింది. దాంతో ఆరులో ఉన్న సన్‌రైజర్స్ ఏడుకి పడిపోగా.. చెన్నై చిట్టచివరి స్థానంలోనే కొనసాగుతోంది. నెం.1 స్థానంలో ఉన్న రాజస్థాన్ మూడికి పడిపోగా.. ఢిల్లీ మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది.
అయ్యో దేవుడా!!.. స్పైడర్ కెమెరా ఎంతపని చేసే.. బంతి సిక్స్ వెళుతుందనుకుంటే..!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications