Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KXIP vs CSK: చెలరేగిన చెన్నై ఓపెనర్లు.. చిత్తుగా ఓడిన పంజాబ్!

Shane Watson and Faf du Plessis

దుబాయ్: షేన్ వాట్సన్(53బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్‌లతో 83 నాటౌట్), ఫాఫ్ డూప్లెసిస్(53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్నందుకుంది. కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 10 వికెట్ల తేడాతో సునాయసంగా గెలుపొందింది. ఈ విజయంతో తమ హ్యాట్రిక్ పరాజయాలకు చెన్నై ఫుల్ స్టాప్ పెట్టింది. నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 63), నికోలస్ పూరన్(17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 33) రాణించారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి 16 బంతులు ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. ఇక ఐపీఎల్ చరిత్రలోనే ఇది సెకండ్ చేజింగ్ హయ్యెస్ట్ పార్టనర్‌షిప్ కాగా ఈ సీజన్‌లో ఇదే ఇప్పటి వరకు అత్యధిక పరుగుల భాగస్వామ్యం. ఇక ఐపీఎల్‌ చరిత్రలో సీఎస్‌కేకు అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం కూడా ఇదే కావడం విశేషం.

అంతకుముదు 179 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌ ప్రారంభం నుంచే ధాటిగా ఆడారు. పంజాబ్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో చెన్నై వికెట్‌ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.

జోర్డాన్‌ వేసిన ఆరో ఓవర్లో డుప్లెసిస్‌ ఏకంగా 4 ఫోర్లు బాది 19 పరుగులు రాబట్టాడు. హర్‌ప్రీత్‌ వేసిన తర్వాతి ఓవర్లో వాట్సన్‌ రెండు ఫోర్లు కొట్టగా.. డుప్లెసిస్‌ ఫోర్‌ బాది మరో 15 రన్స్‌ సాధించారు. ఓపెనర్లిద్దరూ క్రీజులో కుదురుకొని బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో చెన్నై స్కోరు వేగంగా దూసుకెళ్లింది.

జోర్డాన్ వేసిన 11వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలతో షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వాట్సన్ ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. అదే ఓవర్‌లో క్విక్ సింగిల్‌తో డూప్లెసిస్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం కట్టుదిట్టంగా ఆడిన ఈ జోడీ మంచి బంతులను గౌరవిస్తూ చెడ్డ బంతులను బౌండరీకి తరలించింది. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని విడదీసేందుకు కేఎల్ రాహుల్ బౌలర్లను మార్చి శతవిధాల ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దాంతో చెన్నై విజయం లాంఛనమైంది.

Story first published: Sunday, October 4, 2020, 23:33 [IST]
Other articles published on Oct 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+