KXIP vs CSK: పంజాబ్ ఖేల్ ఖతమ్.. హ్యాట్రిక్ విజయంతో ముగించిన చెన్నై!

అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ముగించింది. కింగ్స్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్లతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్నందుకుంది. ఈ ఓటమితో కింగ్స్ పంజాబ్ పోరాటం ముగిసింది. వరుసగా 5 విజయాలతో ఆశలు రేకెత్తించిన రాహుల్ సేన.. అనూహ్య పరాజయాలతో ఇంటి బాట పట్టింది. ధోనీ సేన పోతూ పోతూ పంజాబ్‌ను వెంట తీసుకెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 రన్స్ చేసింది. దీపక్ హుడా (30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 154 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 62 నాటౌట్), ఫాఫ్ డుప్లెసిస్(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) రాణించారు. పంజాబ్ బౌలర్లలో జోర్డాన్‌కు ఒక వికెట్ దక్కింది.

అదిరే ఆరంభం...
154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ మంచి శుభారంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే ఓవర్‌కు ఒక బౌండరీ కొట్టిన ఈ జోడీ మంచి రన్ రేట్ మెయింటేన్ చేసింది. గైక్వాడ్ నిదానంగా ఆడినా.. డూప్లెసిస్ ధాటిగా ఆడాడు. షమీ వేసిన ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన ఫాఫ్.. బిష్ణయ్ వేసిన ఆరో ఓవర్‌లో 6, 4తో 13 పరుగులు పిండుకున్నాడు. దాంతో చెన్నై పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 57 రన్స్ చేసింది.

ఔటా? నాటౌటా?
అనంతరం ఫాఫ్ రివ్యూతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగా.. గైక్వాడ్‌కు కూడా లైఫ్ లభించింది. రవి బిష్టోయ్ వేసిన 8వ ఓవర్ ఐదో బంతిని బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా ఆడగా.. మన్‌దీప్ సింగ్ సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. టీవీ రిప్లేలో పలుమార్లు పరిశీలించి నాటౌట్ ఇచ్చాడు. అయితే ఈ నిర్ణయంపై సందేహం నెలకొంది. బంతి నేలకు తాకినట్లుగా ఉందని భావించిన థర్డ్ అంపైర్.. బెన్‌ఫిట్ బ్యాట్స్‌మెన్ కింద నాటౌట్ ఇచ్చాడు. కానీ ఈ నిర్ణయంపై పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు. కోచ్ అనిల్ కుంబ్లే కూడా అసంతృప్తికి గురైనట్లు టీవీ రిప్లేలో కనిపించింది. అయితే జోర్డాన్ వేసిన 10వ ఓవర్‌లో డూప్లెసిస్(48) కీపర్ రాహుల్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక క్యాచ్ అందుకున్న రాహుల్ రెండు చేతులను చూపిస్తూ అంపైర్ల తీరుపై నిరస వ్యక్తం చేశాడు.

గైక్వాడ్ హాఫ్ సెంచరీ
క్రీజులోకి వచ్చిన రాయుడితో గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. నిదానంగా ఆడిన ఈ జోడీ.. చెన్నైని విజయం దిశగా నడిపించింది. ఈ క్రమంలో బిష్ణోయ్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన గైక్వాడ్ వరుసగా మూడో హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో చెన్నై విజయం లాంచనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications