For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోని జీతం ఎంతో తెలుసా?

IPL 2020 : Know Salary Of MS Dhoni & Other Chennai Super Kings Players ? || Oneindia Telugu
IPL 2020: Know salary of MS Dhoni and other Chennai Super Kings Players

హైదరాబాద్ : భారత క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఆ జట్టు మూడు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచింది. సస్పెన్షన్‌కు గురైన 2016,2017 సీజన్లలో మినహా మిగతా అన్ని సీజన్లలో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరింది. గత సీజన్‌తో కలుపుకొని మొత్తం ఐదు సార్లు రన్నరప్‌గా నిలిచింది. చెన్నై సస్పెన్షన్‌కు గురైన రెండేళ్లు ధోని రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌కు ఆడాడు.

రీ ఎంట్రీలో సూపర్ హిట్

రీ ఎంట్రీలో సూపర్ హిట్

నిషేధానంతరం చెన్నై రీ ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ జట్టు పగ్గాలందుకున్న ధోని.. జట్టం మొత్తం సీనియర్లతో నిండినా.. అంకుల్స్ టీమ్ అనే విమర్శలు వచ్చినా టైటిల్ అందించి తన కెప్టెన్సీ పవరేంటో చూపించాడు. ఇక గత సీజన్‌లో కూడా ముంబై చేతిలో ఆఖరి క్షణాన ఓటమిపాలైన చెన్నై రన్నరప్‌గా నిలిచింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో తమ ఆటగాళ్లను చేజిక్కించుకున్న అన్ని ఫ్రాంచైజీలు ఐపీఎల్ 2020 సీజన్‌కు సంసిద్ధమయ్యాయి. ఈ వేలంలో అనామక ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. పేరుగాంచిన ఆటగాళ్లు కనీస విలువకు అమ్ముడుపోక భంగపాటు గురయ్యారు.

 వేలంలో అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు

వేలంలో అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు

ఇక వేలంలో సామ్ కరన్‌ను రూ. 5.5 కోట్లకు దక్కించుకున్న చెన్నై..టీమిండియా లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లాను రూ. 6.75 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో ఆచితూచి వ్యవహరించే చెన్నై పియూష్‌ చావ్లా కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టడం ఆశ్చర్యం కలిగించింది. ఆసీస్ పేసర్ జోష్ హజెల్ వుడ్‌కు అతని కనీస ధర రూ. 2 కోట్లకు,తమిళనాడు ఎడమచేతివాటం స్పిన్నర్ సాయి కిశోర్‌‌ను రూ. 20 లక్షలకు తీసుకుంది. వేలం ముగిసిన తర్వాత మొత్తం ఆటగాళ్ల జీతభత్యాలు ఎంత? చెన్నై‌ని సక్సెస్‌గా నడిపిస్తున్న ధోనికి ఫ్రాంచైజీ ఎంత మొత్తం చెల్లిస్తుంది? జార్ఖండ్ డైనమైట్, అభిమానులకు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలను మైఖేల్ మీ ముందుంచింది.

చెన్నై ఆటగాళ్ల జీతాలు..

చెన్నై ఆటగాళ్ల జీతాలు..

1. ఎంఎస్ ధోని- రూ. 15 కోట్లు (రిటైన్డ్)

2. సురేష్ రైనా- రూ.11 కోట్లు (రిటైన్డ్)

3. కేదార్ జాదవ్ రూ.7.80 కోట్లు (రిటైన్డ్)

4. రవీంద్రజడేజా- రూ. 7 కోట్లు (రిటైన్డ్)

5. పీయూష్ చావ్లా - రూ. 6.75 కోట్లు

6. డ్వాన్ బ్రావో - రూ.6.40 కోట్లు(రిటైన్డ్)

7. సామ్ కరన్ -రూ. 5.50 కోట్లు

8. కరణ్ శర్మ- రూ. 5 కోట్లు (రిటైన్డ్)

9. షేన్ వాట్సన్ - రూ.4 కోట్లు(రిటైన్డ్)

10. శార్ధుల్ ఠాకుర్- రూ.2.60 కోట్లు (రిటైన్డ్)

11.అంబటి రాయుడు- రూ.2.20 కోట్లు

12. హర్భజన్ సింగ్ - రూ.2 కోట్లు (రిటైన్డ్)

13. జోష్ హజల్ వుడ్- రూ.2 కోట్లు

14. విజయ్-రూ.2 కోట్లు

15. ఫాఫ్ డూప్లెసిస్- రూ.1.6 కోట్లు (రిటైన్డ్)

16.ఇమ్రాన్ ఖాన్-రూ. కోటి(రిటైన్డ్)

17. దీపక్ చహర్-రూ.80 లక్షలు(రిటైన్డ్)

18. లుంగి ఎంగిడి - రూ.50 లక్షలు (రిటైన్డ్)

19. మిచెల్ సాంట్నర్ - రూ. 50 లక్షలు (రిటైన్డ్)

20. అసిఫ్- రూ.40 లక్షలు (రిటైన్డ్)

21. మోను కుమార్ - రూ.20 లక్షలు (రిటైన్డ్)

22. జగదీషన్- రూ. 20 లక్షలు (రిటైన్డ్)

23. సాయి కిషోర్- రూ.20 లక్షలు

24. రుతురాజ్ గైక్వాడ్- రూ.20 లక్షలు

చెన్నై దగ్గర మిగిలింది..

చెన్నై దగ్గర మిగిలింది..

వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 14.60 కోట్లు ఉన్నాయి. అయితే, వేలంలో కేవలం నలుగురు ఆటగాళ్ల కోసం రూ. 14.45 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు చెన్నై వద్ద కేవలం 15 లక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తం 24 మంది ఆటగాళ్లలో 8 విదేశీ ఆటగాళ్లున్నారు.

Story first published: Friday, January 24, 2020, 12:58 [IST]
Other articles published on Jan 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+