Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్‌పై వేటు.. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌?

IPL 2020: KL Rahul to replce Ravichandran Ashwin as KXIP new captain

ముంబై: టీమిండియా స్టార్ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు గడ్డుకాలం నడుస్తోంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న అశ్విన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌కు కెప్టెన్‌గా ఉన్న అశ్విన్‌పై ఆ జట్టు యాజమాన్యం వేటు వేయనుందని సమాచారం తెలుస్తోంది. కెప్టెన్‌గా అశ్విన్‌ను తప్పించి వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అశ్విన్‌ విఫలం:

అశ్విన్‌ విఫలం:

2018 ఐపీఎల్‌ వేలంలో పంజాబ్‌ అశ్విన్‌ను రూ.7.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గత రెండు సంవత్సరాలుగా (2018, 2019) అశ్విన్‌ పంజాబ్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. రెండు సీజన్లలోనూ పంజాబ్‌ ఆశించనంత మేర ఆకట్టులేకపోయింది. జట్టులో క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, పూరన్, కర్రన్, విల్జోన్, షమీ, సర్ఫరాజ్, ముజీబ్ మిల్లర్ లాంటి ఆటగాళ్లు ఉన్నా.. అశ్విన్‌ వారిని సరిగా ఉపయోగించుకోలేక విఫలమయ్యాడు.

కెప్టెన్‌ నియమాకంపై సమావేశం:

కెప్టెన్‌ నియమాకంపై సమావేశం:

పంజాబ్‌ జట్టు తరఫున అశ్విన్‌ 28 మ్యాచ్‌లాడి 25 వికెట్లు తీశాడు. బౌలర్, కెప్టెన్‌గా అశ్విన్‌ ఘోరంగా విఫలం కావడంతో జట్టు యాజమాన్యం ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తోందట. 2020 ఐపీఎల్‌ సమయానికి పంజాబ్ కెప్టెన్‌ను మార్చాలని జట్టు యాజమాన్యం పూనుకుందని తెలుస్తోంది. కెప్టెన్‌ విషయమై జట్టు యాజమాన్యం ఈ వారం చివరలో భేటీ కానుంది. ఈ సమావేశంలో కెప్టెన్‌ నియమాకంపై కీలక నిర్ణయం తీసుకోనుంది.

కోహ్లీ, ర‌హానే అర్ధ‌సెంచరీలు.. భారీ ఆధిక్యం దిశగా భారత్‌

కెప్టెన్‌గా రాహుల్:

కెప్టెన్‌గా రాహుల్:

పంజాబ్ జట్టు సభ్యుడు కేఎల్‌ రాహుల్‌ టీమిండియా తరపున నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారించాడు. ఇక ప్రపంచకప్‌-209లోనూ మంచి ప్రదర్శనే చేశాడు. దీంతో ప్రస్తుతం పంజాబ్ జట్టు యాజమాన్యం రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించాలని చూస్తోందట. మరోవైపు న్యూజిలాండ్ మాజీ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ పంజాబ్ హెడ్ కోచ్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ కోసం పంజాబ్ వెతుకుతోంది. జార్జ్‌ బెయిలీ, డారెన్‌ లెహమాన్‌లను పరిశీలిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం వారితో చర్చలు జరుపుతున్నారట.

Story first published: Sunday, August 25, 2019, 13:44 [IST]
Other articles published on Aug 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+