For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ మ్యాచ్ ఓటమిపై నా దగ్గర సమాధానం లేదు: కేఎల్ రాహుల్

IPL 2020: KL Rahul Says Honestly Have No Answers After KXIPs Heartbreaking Loss To KKR

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఎదురైన అనూహ్య ఓటమిపై తన వద్ద సమాధానం లేదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌ల్లో పంజాబ్ మిల్లీమీటర్ తేడాలో రెండు పరుగులతో ఓటమిపాలైంది. మ్యాచ్ ఆసాంతరం రేసులో నిలిచిన పంజాబ్.. చివర్లో కోల్‌కతా సూపర్ బౌలింగ్‌కు చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్.. అద్భుతంగా రాణించినా ఫలితం దక్కలేదన్నాడు. కీలక దశలో వికెట్లు చేజార్చుకోవడంతో మూల్యం చెల్లించుకున్నామన్నాడు.

'ఈ మ్యాచ్‌లో మేం అద్బుతంగా రాణించాం. కానీ దగ్గరగా వచ్చి ఓడిపోయాం. ఓటమిపై నా వద్ద ఎలాంటి సమాధానాలు లేవు. తదుపరి ఏడు మ్యాచ్‌ల్లో గొప్పగా పోరాడి విజయాలు సాధించడానికి ప్రయత్నిస్తాం. అయితే మేం అద్భుతంగా బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని 180 పరుగులలోపే కట్టడి చేశాం. పవర్‌ప్లేలోనే వికెట్లు పడగొట్టాం. అంతేగాక, ఆఖరి ఓవర్లలోనూ బౌన్సర్లు, వైడ్‌ యార్కర్లతో గొప్పగా బౌలింగ్‌ చేశాం. కానీ, చేజింగ్‌లో ఏ దశలోనూ సంతృప్తి చెందలేదు. గెలిస్తేనే ఆనందం ఉంటుంది. నేను, మయాంక్‌ అగర్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చాం. కానీ, కీలకమైన దశలో వికెట్లు కోల్పోయి విజయాన్ని చేజార్చుకున్నాం'అని రాహుల్‌ తెలిపాడు.

మ్యాచ్‌లో పంజాబ్ 17 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన దశలో చేతిలో 9 వికెట్లు ఉన్నా.. పంజాబ్ ఓటమి చవిచూసింది. ఒత్తిడికి చిత్తవుతూ బ్యాట్స్‌మెన్ తడబడటంతో పంజాబ్ చివరకు 18 పరుగులు మాత్రమే చేసి ఓటమిని ఆహ్వానించింది. మ్యాక్స్‌వెల్ కొట్టిన భారీ షాట్ బౌండరీకి మిల్లీమీటర్ దూరంలో పడి ఫోర్‌గా వెళ్లింది. ఈమ్యాచ్‌లో పంజాబ్‌కు ఏ మాత్రం అదృష్టం కలిసి రాలేదు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (29 బంతుల్లో 58; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. శుబ్‌మన్‌ గిల్‌ (47 బంతుల్లో 57; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (58 బంతుల్లో 74; 6 ఫోర్లు), మయాంక్‌ (39 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు.

Story first published: Sunday, October 11, 2020, 9:21 [IST]
Other articles published on Oct 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+