Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs RR: కోల్‌కతాదే బ్యాటింగ్.. రస్సెల్ ఆగయా

 Rajasthan Royals won the toss and Choose field First

దుబాయ్: కోల్‌కతా నైట్‌రైరడ్స్‌తో జరుగుతున్న చావో రేవో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, పైగా చేజింగ్‌లో తమ జట్టు అదరగొడుతుందని రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండా విన్నింగ్ టీమ్‌తో‌నే బరిలోకి దిగుతున్నామన్నాడు. ఇక తాము కూడా ఫీల్డింగే తీసుకున్నామని కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. ఫెర్గూసన్, రింకూ సింగ్ స్థానంలో ఆండ్రూ రస్సెల్, శివమ్ మావి జట్టులోకి వచ్చారని తెలిపాడు.

తలో పన్నెండు పాయింట్లతో 6,7 స్థానాల్లో నిలిచిన రాజస్తాన్‌‌‌‌, కోల్‌‌‌‌కతా జట్ల భవితవ్యం ఈ మ్యాచ్ ఫలితంపైనే ఆధారపడి ఉంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. పటిష్ట ముంబైతో పాటు పంజాబ్‌‌‌‌ను చిత్తు చేసి జోరు మీదున్న రాయల్స్‌‌‌‌కే కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. అదే ఊపులో కోల్‌‌‌‌కతా పని పట్టి 14 పాయింట్లు ఖాతాలో వేసుకోవాలని చూస్తోందా జట్టు. చివరి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడడంతో పాటు తక్కువ రన్‌‌‌‌రేట్‌‌‌‌తో ఉన్న కోల్‌‌‌‌కతా భారీ విజయంపై కన్నేసింది. అయితే ఇరు జట్లకు గెలవడమే ముఖ్యం కాదు.. రన్‌రేట్ మెరుగుపరుచుకోవడం కూడా అవసరమే. గెలిచినా.. మెరుగైనా రన్‌రేట్ లేకుంటే ఇంటి దారి పట్టాల్సిందే. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 21 సార్లు తలపడగా 11-10తో కోల్‌కతా లీడ్‌లో ఉంది. గత సీజన్‌లో చెరొక మ్యాచ్ గెలిచాయి. అయితే ఈ సీజన్ ఫస్టాఫ్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలవడం కోల్‌కతా కలిసొచ్చే అంశం.

తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: శుభమ‌న్ గిల్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తీక్( కీపర్), శివం మావి, ప్యాట్ కమిన్స్, ఆండ్రూ రస్సెల్, కమలేష్ నాగర్ కోటీ, వరుణ్ చక్రవర్తి

రాజస్థాన్ రాయల్స్: బెన్ స్టోక్స్, రాబిన్ ఊతప్ప, సంజూ శాంసన్(కీపర్), రాబిన్ ఊతప్ప, స్టీవ్ స్మిత్(కెప్టెన్), జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, వరుణ్ ఆరోన్, కార్తీక్ త్యాగి

Story first published: Sunday, November 1, 2020, 19:36 [IST]
Other articles published on Nov 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+