For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RCB: మహ్మద్‌ సిరాజ్ అదుర్స్.. కోల్‌కతాపై బెంగళూరు సునాయాస విజయం!!

IPL 2020, KKR vs RCB: Mohammed Siraj helps Bangalore thrash Kolkata by 8 wickets

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాట్స్‌మన్‌ ఆడుతూపాడుతూ ఛేదించారు. 85 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన 13.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అరోన్‌ ఫించ్‌ (16), దేవదత్‌ పడిక్కల్‌ (25), గుర్‌కీరత్‌ సింగ్ మాన్ (21), విరాట్ కోహ్లీ (18) తలో చేయి వేశారు. ఇదే పిచ్‌పై బెంగళూరు బౌలర్లు చెలరేగితే.. కోల్‌కతా బౌలర్లు మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫర్గుసన్ ఒక వికెట్ తీశాడు. ఈ సీజన్‌లో తొలిసారి మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షంగా ముగిసింది. ఈ విజయంతో కోహ్లీసేన పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. బెంగళూరు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి.

పడిక్కల్ మెరుపులు:

పడిక్కల్ మెరుపులు:

స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగళూరుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. దేవదత్‌ పడిక్కల్ ‌(25: 17 బంతుల్లో 3ఫోర్లు)‌ ధాటిగా ఆడగా.. ఆరోన్‌ ఫించ్‌ (16; 21 బంతుల్లో, 2×4) ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరి మెరుపులతో పవర్‌ప్లే చివరికి బెంగళూరు 44/0తో నిలిచింది. ఈ జంట తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. అయితే ఫెర్గూసన్‌ వేసిన 7వ ఓవర్‌లో వీరిద్దరు పెవిలియన్‌కు చేరారు. రెండో బంతికి ఫించ్ .. వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. నాలుగో బంతికి పడిక్కల్‌ అనూహ్యంగా రనౌటయ్యాడు. సమన్వయ లోపంతో పడిక్కల్‌ పెవిలియన్ చేరాడు.

ముగించిన కోహ్లీ

ముగించిన కోహ్లీ

ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (18*; 17 బంతుల్లో, 2×4) మరో బ్యాట్స్‌మన్‌ గుర్‌కీరత్‌ సింగ్ మాన్ (21; 26 బంతుల్లో, 4×4)‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కోల్‌కతా బౌలర్లలో ఫర్గుసన్‌ ఒక వికెట్‌ తీశాడు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ.. తర్వాత గేర్‌ మార్చి బౌండరీలు బాదారు. దీంతో బెంగళూరు 13.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో కోహ్లీసేన మరోసారి అదరగొట్టింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్‌కు మరింత చేరువైంది. ఈ సీజన్‌లో 10వ మ్యాచ్ ఆడిన బెంగళూరుకి ఇది ఏడో గెలుపు.

సిరాజ్‌ నిప్పులు:

సిరాజ్‌ నిప్పులు:

అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకున్న కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. మహ్మద్‌ సిరాజ్‌ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి కోల్‌కతాను దెబ్బకొట్టాడు. రెండో ఓవర్‌ మూడో బంతికి ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (1) ఔట్ అయ్యాడు.ఆ తర్వాతి బంతికే అప్పుడే క్రీజులోకి వచ్చిన నితీశ్‌ రాణా (0) బౌల్డ్‌ అయ్యాడు. నవదీప్‌ సైనీ వేసిన మూడో ఓవర్‌లో మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ ‌(1) కూడా ఔటయ్యాడు. దీంతో మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ కష్టాల్లో పడింది.

మోర్గాన్‌ ఒంటరి పోరాటం:

మోర్గాన్‌ ఒంటరి పోరాటం:

ఇక సిరాజ్‌ వేసిన నాలుగో ఓవర్‌లో టామ్‌ బాంటన్ ‌(10) కూడా కీపర్‌ డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ సమయంలో ఇయాన్‌ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌ ఐదు ఓవర్ల పాటు మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. అయితే పరుగులు మాత్రం చేయలేకపోయారు. దీంతో స్కోర్ వేగం బాగా తగ్గిపోయింది. తొమ్మిదో ఓవర్ నాలుగో బంతికి కార్తీక్ (4)ఔట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. బెంగళూరు బౌలర్ల ధాటికి ప్యాట్ కమ్మిన్స్ 17 బంతుల్లో 4 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఈ సమయంలో మోర్గాన్‌ (30; 34 బంతుల్లో, 1×4, 1×6) ఒంటరి పోరాటం చేశాడు. చివరలో కుల్దీప్‌ యాదవ్‌ (12), ఫర్గుసన్ ‌(19 నాటౌట్‌) పరుగులు చేయడంతో కోల్‌కతా 84 పరుగులు చేసింది. సిరాజ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు.

Kings XI Punjab: మాక్స్‌వెల్ విఫలమవుతున్నా.. అందుకే ఆడిస్తున్నాం: కేఎల్‌ రాహుల్‌

Story first published: Wednesday, October 21, 2020, 23:11 [IST]
Other articles published on Oct 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+