
షార్జా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తమ జట్టుకు చేజింగ్ చేయడం ఇష్టమని, అలాగే డ్యూ ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. గాయం నుంచి మయాంక్ అగర్వాల్ ఇంకా కోలుకోలేదన్నాడు. ఇక కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకునేవాళ్లమన్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
వరుస విజయాలతో కింగ్స్ పంజాబ్ దూకుడు మీదుండగా.. పటిష్ట ఢిల్లీని ఢీకొట్టి కోల్‌కతా ఉత్సాహంగా ఉంది. ఇరు జట్లకు చావో రేవో మ్యాచ్ కావడంతో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడిన జట్టు దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో పంజాబ్ ఇంచు తేడాలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ విజయానికి 17 బంతుల్లో 21 పరుగులు చేయాల్సి ఉండగా.. వెంటవెంటనే వికెట్ల చేజార్చుకొని ఓటమిపాలైంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కేఎల్ రాహుల్(కెప్టెన్, కీపర్), మన్‌దీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లేన్ మాక్స్‌వెల్, మన్‌దీప్ సింగ్, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ
కోల్‌కతా నైట్ రైడర్స్: నితీష్ రాణా, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తీక్(కీపర్), సునీల్ నరైన్, పాట్ కమిన్స్, కమలేశ్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ, లాకి ఫెర్గూసన్